అక్షరటుడే, వెబ్డెస్క్ : Three Months Ration | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించింది. ఎల్నినో (El Nino) ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి అందించాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 1 నుంచి 31 వరకు పంపిణీ చేపట్టాలని సూచించింది. దీంతో రాష్ట్ర పౌర సరఫరా శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి నెలా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఒకటో తేది నుంచి 15 వరకు డీలర్లు బియ్యం అందిస్తారు. అయితే ఒకేసారి మూడు నెలల బియ్యం ఇస్తుండటంతో నెల రోజుల పాటు పంపిణీ చేయాలని ప్రభుత్వం డీలర్లను ఆదేశించింది. బియ్యం కోసం మూడు సార్లు బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. గతంలో సైతం ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్నూ ఒకే నెలలో పంపిణీ చేశారు.
Three Months Ration | ఈ కేవైసీ చేయించాలి
రేషన్ కార్డు (Ration Card) లబ్ధిదారులు ఈ కేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచించారు. ఈ కేవైసీ నమోదైన వారికి మాత్రమే వచ్చే నెల నుంచి రేషన్ సరఫరా అయ్యేలా జాతీయ సమాచార వ్యవస్థ (ఎన్‌ఐసీ) సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేస్తుంది. తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డులో పేరు ఎక్కిన వారు చాలా మంది ఇంకా ఈ కేవైసీ చేయించుకోలేదు. ఈ నెల 31 వరకు ఈ కేవైసీ చేయించుకోవడానికి గడువు ఉంది. ఇప్పటి వరకే చేయించుకోని వారు సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి ఉచితంగా కేవైసీ చేయించుకోవచ్చు.
దీనిని కూడా చదవండి : PV Sindhu Japan Open | పీవీ సింధు సంచలనం.. జపాన్ ఓపెన్ టైటిల్ కైవసం