అక్షరటుడే వెబ్‌డెస్క్: Singareni Jobs | సింగరేణి సంస్థలో మెడికల్ అన్‌ఫిట్ అయిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పించాలన్న డిమాండ్‌ను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి తెరపైకి తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.
Singareni Jobs | నామమాత్రపు మెడికల్ బోర్డు..
దాదాపు 2 వేల మంది కార్మికులు మెడికల్ బోర్డు కోసం ఎదురుచూస్తుంటే, ప్రభుత్వం కేవలం నామమాత్రపు తంతుగా బోర్డును నిర్వహించిందని కవిత విమర్శించారు. ఇందులోనూ 120 మంది పేర్లు మాత్రమే ప్రకటించి, కనీసం బాధితులకు సమాచారం కూడా అందించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. మెడికల్ బోర్డుకు పిలిచిన వారిలో కేవలం 20 శాతం మందికే ఫిట్నెస్ నిరాకరించడం, ప్రభుత్వానికి కార్మికుల పట్ల చిత్తశుద్ధి లేదనడానికి నిదర్శనమని ఆమె ఆరోపించారు. సీఎం, డిప్యూటీ సీఎంలు కమీషన్ల కోసం సంస్థను నిర్వీర్యం చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Singareni Jobs | ఎమ్మెల్యేల మౌనంపై ప్రశ్నలు..
కార్మికుల ఓట్లతో గెలిచిన కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు, కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై ఎందుకు స్పందించడం లేదని కవిత నిలదీశారు. మెడికల్ బోర్డు ప్రక్రియను నెలకు రెండుసార్లు నిర్వహించేలా ఒత్తిడి తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు.
Singareni Jobs | భవిష్యత్తు కార్యాచరణ..
గతంలో మాదిరిగానే మెడికల్ అన్‌ఫిట్ ప్రక్రియను కొనసాగించాలని, లేనిపక్షంలో నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, హెచ్‌ఎంఎస్ (HMS) , తమ పార్టీ క్యాడర్ స్థానిక ఎమ్మెల్యేలను నిలదీయాలని కవిత పిలుపునిచ్చారు.
మెడికల్ బోర్డును నామమాత్రంగా నిర్వహించి మరోసారి సింగరేణి కార్మికులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
2 వేల మంది కార్మికులు మెడికల్ బోర్డు కోసం ఎదురు చూస్తుంటే కేవలం 120 మంది కార్మికుల పేర్లు మాత్రమే ప్రకటించి.. అందులోనూ 28 మంది కార్మికులకు తమను మెడికల్ బోర్డుకు పిలిచారనే సమాచారం… pic.twitter.com/jKmgoCD1Aj
— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 19, 2026
ఇది కూడా చదవండి: US Iran Conflict | అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు