Yadagirigutta Temple | యాదగిరిగుట్టలో తిరుమల విధానం.. భూ కేటాయింపులపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మరింత వైభవోపేతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.

Shivam nagarani

అక్షరటుడే దెబ్‌డెస్క్: Yadagirigutta Temple | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్నిమరింత వైభవోపేతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ క్రమంలో టీటీడీ (TTD) అనుసరిస్తున్న భూ కేటాయింపులు, ఆలయ నిర్వహణ విధానాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఎంసీఆర్‍హెచ్‍ఆర్‍డిలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.

Yadagirigutta Temple | కీలక నిర్ణయాలు..

భవిష్యత్తులో ఎవరికి భూములు కేటాయించినా, ఆ స్థలం పూర్తి యాజమాన్య హక్కులు ఆలయ బోర్డు వద్దే ఉండాలని సీఎం స్పష్టం చేశారు. మఠాలు, కుల సంఘాలకు భూముల కేటాయింపు విషయంలో పారదర్శకమైన నిబంధనలతో కూడిన ఒక శాశ్వత విధానాన్ని (Policy) సిద్ధం చేయాలని ఆదేశించారు. హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్‌కు యాదగిరిగుట్టలో కేటాయించాల్సిన భూమిని ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ ధరకే ఇవ్వాలని స్పష్టం చేశారు.
yadadri 1

Yadagirigutta Temple | గెస్ట్ హౌస్‌ల నిర్మాణం..

భక్తుల సౌకర్యార్థం గెస్ట్ హౌస్‌ల నిర్మాణానికి టీటీడీ తరహా మోడల్‌ను అనుసరించాలని నిర్ణయించారు. ముందుగా గెస్ట్ హౌస్‌ల నిర్మాణానికి ముందుకు వచ్చిన వారి జాబితాను సిద్ధం చేసి, విడతల వారీగా అనుమతులు మంజూరు చేయనున్నారు. పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) పద్ధతిలో యాదగిరిగుట్ట పరిసరాల్లో టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు.

Yadagirigutta Temple | వారంలో నివేదిక..

ఆలయ నిర్మాణాలపై గతంలో ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి, వారం రోజుల్లోగా తుది నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు , ఆర్థిక శాఖ కార్యదర్శులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:  Harish Rao | పాలమూరు పరువు తీస్తున్న రేవంత్​రెడ్డి : హరీశ్​రావు

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *