అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao | సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేశారు. పాలమూరు పరువు తీస్తున్నారని మండిపడ్డారు. జడ్చర్లలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ హామీ ఇవ్వకున్న రైతుబంధు పథకం తీసుకొచ్చారని చెప్పారు. కానీ రేవంత్‌రెడ్డి రూ.15 వేల రైతు భరోసా వేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
Harish Rao | రైతు వంచన సభ

రేవంత్‌రెడ్డి పెట్టేది ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ అని హరీశ్‌రావు అన్నారు. యాసంగి రైతుబంధు పూర్తి స్థాయిలో వేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ రూ. 29,300 కోట్లు రైతులకు బాకీ పడిందన్నారు. KCR చేతిలో ఉంటేనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందన్నారు. పంటలకు ఇస్తామన్న బోనస్ బోగస్‌గా మారిందని ధ్వజమెత్తారు. షాపులో యూరియా ఉంటే యాప్ ఎందుకని ప్రశ్నించారు. షాపులో లేదు కాబట్టే యాప్ అంటూ కథలు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు– రంగారెడ్డి పథకాన్ని కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు.
రైతు ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ
ఎన్నికల ముందు ఎకరానికి రూ.15 వేలు అని చెప్పి ఇచ్చింది రూ.12 వేలు.. అందులో ఒక పంట మొత్తం ఎగ్గొట్టాడు
ఇంకోసారి 2 ఎకరాల వరకే ఇచ్చాడు.. ఇంకోసారి 3 ఎకరాల వరకే ఇచ్చాడు
కాంగ్రెస్ ప్రభుత్వం రూ.29300 కోట్లు రైతు బంధు పేరిట రైతులకు బాకీ పడింది
— Telugu Scribe (@TeluguScribe) June 30, 2026
దీనిని కూడా చదవండి : Nitin Nabin Criticisms | తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకుంటోంది: నితిన్ నబీన్