తెలంగాణACB Raids on Deputy Collector | డిప్యూటీ కలెక్టర్​ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీగా...

ACB Raids on Deputy Collector | డిప్యూటీ కలెక్టర్​ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీగా అక్రమాస్తుల గుర్తింపు

మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా వంశీమోహన్​ ఇంట్లో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. భారీగా అక్రమాస్తులను గుర్తించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids on Deputy Collector | మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకొని వందల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టిన అధికారి ఇంట్లో ఏసీబీ (ACB) అధికారులు సోదాలు చేశారు. మేడ్చల్ – మల్కాజ్‌గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్‌ వంశీమోహన్ (Deputy Collector Vamsi Mohan)​ ఇంట్లో శుక్రవారం ఉదయం నుంచి తనిఖీలు చేపట్టారు.

డిప్యూటీ కలెక్టర్​ వంశీమోహన్​పై అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి సమాచారం అందింది. దీంతో అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్​ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆయనకు చెందిన 8 ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. వంశీమోహన్​కు చెందిన రూ.వందల కోట్ల అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. అతడిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ACB Raids on Deputy Collector | ఆర్డీవోగా పని చేసిన సమయంలో..

వంశీమోహన్​ గతంలో శేరిలింగంపల్లితో పాటు పలు ప్రాంతాల్లో ఆర్డీవో (RDO)గా పని చేశారు. ఆ సమయంలో అబ్దుల్లాపూర్​మెట్, పిగ్లీపురంలో 8 ఎకరాల భూమిని ఆయన కాజేసినట్లు సమాచారం. సదరు భూమిని మొదట తన మామ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి.. తర్వాత ఓ రియల్టర్‌కు కట్టెబట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే ఓ రియల్​ ఎస్టేట్​ వ్యాపారి నుంచి వంశీమోహన్​ 10 ప్లాట్లు గిఫ్ట్‌ డీడ్‌‌గా తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ACB Raids on Deputy Collector | ఏసీబీ దూకుడు

ఏసీబీ అధికారులు ఇటీవల దూకుడు పెంచారు. ఓ వైపు లంచాలు తీసుకుంటున్న అధికారులను రెడ్ హ్యాండెడ్​గా పట్టుకుంటున్నారు. మరోవైపు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన అధికారులపై దాడులు చేస్తున్నారు. ఇటీవల జలమండలి జీఎం ఇంట్లో సోదాలు జరిపి భారీగా అక్రమాస్తులు గుర్తించారు. తాజాగా డిప్యూటీ కలెక్టర్​ ఇంట్లో తనిఖీలు చేపట్టారు.

దీనిని కూడా చదవండి : ADE Bribery Arrest | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏడీఈ

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Jukkal MLA Comments | పోలీస్ vs ప్రజాప్రతినిధులు! అధికార పక్షంలో నివురుగప్పిన నిప్పులా ‘మాఫియా’ వివాదం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Jukkal MLA Comments | తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు...

SRH vs RCB | IPL 2026: హైదరాబాద్ భారీ లక్ష్యం.. పవర్‌ప్లేలోనే ఆర్సీబీ కీలక వికెట్లు డౌన్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH vs RCB | రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో...

NIMS Kidney Transplants | కిడ్నీ ట్రాన్స్​ప్లాంట్స్​లో నిమ్స్​ అరుదైన రికార్డు.. 2K మైలురాయి పూర్తి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: NIMS Kidney Transplants | కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్స్...

SBI Employees Candle Rally | ఎస్​బీఐ ఉద్యోగుల క్యాండిల్​ ర్యాలీ..

​అక్షరటుడే, ఇందూరు: SBI Employees Candle Rally | స్టేట్ బ్యాంక్​...