HMDA Bachupally e-auction | బాచుపల్లి లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ.55.43 కోట్ల ఆదాయం!

మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతం కావడంతో, HMDA లేఅవుట్లలో ప్లాట్ల కొనుగోలుకు ప్రజలు, ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారని ఈ వేలం ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: HMDA Bachupally e-auction | హైదరాబాద్​లోని బాచుపల్లి లేఅవుట్‌లో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) నిర్వహించిన ఓపెన్ ప్లాట్ల ఈ-వేలానికి కొనుగోలుదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ వేలం ప్రక్రియ ద్వారా HMDA ఖజానాకు మొత్తం రూ.55.43 కోట్ల ఆదాయం సమకూరింది.

HMDA Bachupally e-auction | 50కి 40 అమ్మకం..

బాచుపల్లి లేఅవుట్‌లో మొత్తం 50 ప్లాట్లను వేలానికి ఉంచగా, వాటిలో 40 ప్లాట్ల విక్రయం విజయవంతంగా పూర్తయింది. ఈ-వేలంలో పోటీ నెలకొనడంతో గరిష్టంగా చదరపు గజానికి రూ.60,500 ధర పలికింది. మొత్తం విక్రయాలకు సంబంధించి చదరపు గజానికి వెయిటెడ్ యావరేజ్ (సగటు) ధర రూ.49,737గా నమోదైనట్లు HMDA అధికారులు వెల్లడించారు.

నగర శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతం కావడంతో, HMDA లేఅవుట్లలో ప్లాట్ల కొనుగోలుకు ప్రజలు, ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారని ఈ వేలం ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *