Madhapur ganja bust | ఫుడ్ డెలివరీ ముసుగులో గంజాయి దందా.. మాదాపూర్‌లో స్విగ్గీ బాయ్ అరెస్టు!

నిందితుడి వద్ద నుంచి 1,089 గ్రాముల (1.089 కిలోల) గంజాయితో పాటు, ప్యాకెట్లు చేసి తూకం వేసేందుకు వినియోగిస్తున్న ఒక ఎలక్ట్రానిక్ తూకం యంత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Madhapur ganja bust | హైదరాబాద్ Hyderabad నగరంలోని ఐటీ కారిడార్ మాదాపూర్‌లో ఫుడ్ డెలివరీ ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న ఓ యువకుడిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు స్విగ్గీ (Swiggy) డెలివరీ బాయ్ అవతారమెత్తి ఈ దందా సాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

Madhapur ganja bust | నిందితుడు ఒడిశా వాసి..

మాదాపూర్ పరిధిలో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు నిఘా పెట్టి, ఒడిశా రాష్ట్రానికి చెందిన బలరాం మొహంతా (28) అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడి వద్ద నుంచి 1,089 గ్రాముల (1.089 కిలోల) గంజాయితో పాటు, ప్యాకెట్లు చేసి తూకం వేసేందుకు వినియోగిస్తున్న ఒక ఎలక్ట్రానిక్ తూకం యంత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Madhapur ganja bust | ఆహార పొట్లాల మాటున..

ఫుడ్ డెలివరీ బ్యాగుల్లో ఆహార పొట్లాల మాటున గంజాయిని తీసుకెళ్తూ, కస్టమర్లకు నేరుగా సరఫరా చేస్తూ నిందితుడు ఈ అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. నిందితుడిపై ఎన్డీపీఎస్ (NDPS) చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అతనికి ఒడిశా నుంచి గంజాయి ఎలా సరఫరా అవుతోంది? హైదరాబాద్‌లో ఎవరెవరికి విక్రయిస్తున్నాడు? అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేపట్టారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *