Danam Nagender | ఎంఐఎం ఎమ్మెల్యేలను చూస్తే అధికారులకు భయం : దానం నాగేందర్

ఎంఐఎం ఎమ్మెల్యేలు అంటే అధికారులు వణికిపోతారని ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్​ అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Danam Nagender | ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యేలను చూస్తే అధికారులు భయపడుతారన్నారు. తమకు మాత్రం విలువ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దానం నాగేందర్​ శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడారు. హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల డ్రా ప్రక్రియలో అధికారులు తమకు విలువ ఇవ్వడం లేదని, ఎంఐఎం ఎమ్మెల్యేలకు భయపడుతున్నారన్నారు. వారు ఇష్టం వచ్చినట్లు తిడుతారని, అందుకే అధికారులు ఎంఐఎం ఎమ్మెల్యేల పని చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.

Danam Nagender | పట్టించుకోవడం లేదు

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఆయన స్పీకర్​కు ప్రివిలేజ్​ నోటీసు అందించారు. తన నియోజకవర్గంలో మొత్తం 480 ఇళ్లు కేటాయించారని చెప్పారు. ఇతర నియోజకవర్గాల్లో నివాసితులకు ఖైరతాబాద్​లో ఇళ్లు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గ ప్రజలకు వేరే ప్రాంతంలో ఇళ్లు ఇచ్చారన్నారు. అధికారులు తాము వచ్చే వరకు ఆగకుండా డ్రా తీశారన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేల పరిధిలో మాత్రం ఇళ్లు సరిగ్గా ఇచ్చారన్నారు. తమను మాత్రం పట్టించుకోవడం లేదని చెప్పారు.

Danam Nagender | చర్యలు తీసుకోవాలి

తన నియోజకవర్గంలో ఇళ్ల కేటాయింపులో తప్పిదాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయం మంత్రికి చెబితే కూల్, కూల్ అని అంటున్నారని పేర్కొన్నారు. జీరో అవర్‌కు విలువ లేకుండా పోయిందని దానం ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలు నోట్ చేసుకుంటున్నామని చెబుతున్నారని, కానీ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం రావడం లేదన్నారు.

ఇది కూడా చదవండి..: Telangana Heavy Rain | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *