7అక్షరటుడే వెబ్‌డెస్క్:PMJ Jewellery Robbery|కరీంనగర్‌లోని పీఎంజే (PMJ) జ్యువెలరీ షోరూమ్‌లో కాల్పులు జరిపి బీభత్సం సృష్టించిన సంచలన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘోరానికి పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసు వివరాలను కరీంనగర్ పోలీస్ కమిషనర్ (CP) గౌస్ ఆలం మీడియాకు వెల్లడించారు.
PMJ Jewellery Robbery|భారీ రికవరీ..
ఈ దోపిడీలో మొత్తం 161 తులాల బంగారం, 112 క్యారెట్ల వజ్రాభరణాలు అపహరణకు గురైనట్లు సీపీ తెలిపారు. ఈ ముఠాకు బీహార్‌కు చెందిన సుబోధ్ సింగ్ ప్రధాన సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. ఈ ముఠాపై బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ వంటి పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అనేక దోపిడీ కేసులు ఉన్నాయి. దోపిడీకి రెండు నెలల ముందే నిందితులు షోరూమ్ పరిసరాల్లో రెక్కీ నిర్వహించినట్లు విచారణలో తేలింది. నేరం చేసిన తర్వాత రైళ్లు, బస్సుల ద్వారా పరారయ్యేందుకు వారు పక్కాగా స్కెచ్ వేశారు.
PMJ Jewellery Robbery|పోలీసుల చాకచక్యం..
కేసును అత్యంత వేగంగా దర్యాప్తు చేసి, నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులను, సిబ్బందిని సీపీ గౌస్ ఆలం అభినందించారు. ఈ ముఠాలోని ఇతర సభ్యుల కోసం, మిగిలిన సొత్తు రికవరీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Hyderabad Drugs Seizure | హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం