CM VD Satheesan | కేరళం సీఎంగా వీడీ సతీషన్​.. కాంగ్రెస్​ ప్రకటన

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM VD Satheesan | కేరళం సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ వీడింది. కాంగ్రెస్​ అగ్రనేతల చర్చల అనంతరం వీడీ సతీషన్​ను సీఎంగా ఎంపిక చేశారు. ఈ మేరకు దీపదాస్​ మున్షీ ప్రకటించారు.

కేరళం (Kerala)లో కాంగ్రెస్​ నేతృత్వంలోని యూడీఎఫ్​ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మే 4న వెలువడిన ఫలితాల్లో యూడీఎఫ్ 102 స్థానాల్లో గెలుపొందింది. అయితే సీఎం రేసులో సతీషన్​ పాటు కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితాల ఉన్నారు. అధిష్టానం వద్ద కేసీ వేణుగోపాల్​కు మంచి పట్టు ఉండటంతో ఆయననే సీఎం చేస్తారని భావించారు. అయితే స్థానిక కాంగ్రెస్ నాయకులు, కూటమిలోని మిత్ర పక్షాలు సతీషన్​ను సీఎం చేయాలని కోరారు. ఈ మేరకు సుదీర్ఘ చర్చల అనంతరం సీఎంగా సతీషన్​ను కాంగ్రెస్​ హైకమాండ్​ ఖరారు చేసింది. దీంతో కేరళంలోని ఆయన నివాసంలో కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకున్నారు.

CM VD Satheesan | ఆరుసార్లు ఎమ్మెల్యేగా..

వీడీ సతీషన్​ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రంలో, పార్టీలో అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో ఆయన ఒకరు. ఇతర సీనియర్ నాయకులైన కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితాలను పక్కన పెట్టిన కాంగ్రెస్​ సతీషన్​ను ఎంపిక చేసింది. మే 7న తిరువనంతపురంలో జరిగిన కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశంలో, కేరళ రాష్ట్రంలో సీఎల్పీకి కొత్త నాయకుడిని నియమించే అధికారాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడికి ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. వి.డి. సతీషన్‌ను సీఎల్పీ నాయకుడిగా నియమించాలని నిర్ణయించబడింది అని కాంగ్రెస్ నాయకురాలు దీపా దాస్‌మున్సి ఢిల్లీలో ప్రకటించారు.

CM VD Satheesan | ఏకాభిప్రాయంతో..

కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అధికశాతం మంది వేణుగోపాల్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ, 2021 ఎన్నికలలో పార్టీకి ఎదురుదెబ్బ తగిలినప్పటి నుండి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సతీషన్ తీవ్రంగా శ్రమించారు. తిరిగి అధికారంలోకి తేవడానికి కృషి చేశారు. పార్టీ నేతృత్వంలోని కూటమి సాధించిన 102 సీట్ల ఘన విజయానికి ఆయనే సూత్రధారి అని ప్రశంసలు అందుకున్నారు. ఈ క్రమంలో అధిష్టానం ఆయనకు పదవి అప్పగించింది. పార్టీ నాయకత్వం, ఇతర ముఖ్యమంత్రి అభ్యర్థుల మధ్య ఏకాభిప్రాయం ద్వారా చివరికి సతీసన్‌ను నియమించాలనే నిర్ణయం వెలువడిందని పార్టీ వర్గాలు తెలిపాయి.

CM VD Satheesan | హైకోర్టు న్యాయవాదిగా..

వీడీ సతీషన్‌ స్వస్థలం ఎర్నాకులం జిల్లా నెట్టూరు. రాజాకీలయాలకు ముందు హైకోర్టు న్యాయవాదిగా ఆయన పని చేశారు. పరావూర్ నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2001లో మొదటిసారి గెలిచిన ఆయన ఇప్పటి వరకు ఓడిపోలేదు.

ఇది కూడా చదవండి..: Sugar Export Ban | కేంద్రం కీలక నిర్ణయం.. చక్కెర ఎగుమతులపై నిషేధం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *