West Bengal Election Results | బెంగాల్​లో మెజారిటీ మార్కును దాటిన బీజేపీ

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: West Bengal Election Results | పశ్చిమ బెంగాల్​ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్​ కొనసాగుతోంది. మెజారిటీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఆధిక్యంలో భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) మ్యాజిక్​ ఫిగర్​ను దాటేసింది.

బెంగాల్​లో తొలిసారి కాషాయ జెండా ఎగరనుంది. ఒకప్పుడు కమ్యూనిస్ట్​లకు కంచుకోటగా ఉన్న బెంగాల్​లో తాజాగా కమలం వికసించనుంది. కమ్యూనిస్ట్​లను మమత బెనర్జీ (Mamata Banerjee) అధికారం నుంచి దించేయగా.. ఆమెకు బీజేపీ షాక్​ ఇవ్వనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్నికల కౌంటింగ్​లో బీజేపీ హవా కొనసాగుతోంది.

West Bengal Election Results | 182 స్థానాల్లో..

బెంగాల్​ (Bengal)లో మొత్తం 293 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అధికారం దక్కాలంటే 148 స్థానాల్లో విజయం సాధించాలి. అయితే బీజేపీ ప్రస్తుతం 182 స్థానాల్లో లీడ్​లో కొనసాగుతుండటం విశేషం. టీఎంసీ 106, వామపక్ష పార్టీలు 1, కాంగ్రెస్​ 1 చోట ఆధిక్యంలో ఉన్నాయి. దీంతో మూడు సార్లు సీఎంగా పని చేసిన మమత ఈ సారి అధికారానికి దూరం కానున్నారు. బీజేపీ గెలిస్తే ఆ పార్టీ నేత సువేంద్​ అధికారి సీఎం అయ్యే అవకాశం ఉంది.

West Bengal Election Results | రెండు చోట్ల సీఎం వెనుకంజ

ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్వయంగా రెండు చోట్ల వెనుకంజలో ఉన్నారు. నందిగ్రామ్​తో పాటు, భవనిపూర్​లో ఆమెపై బీజేపీ నాయకులు సువేంద్​ అధికారి లీడ్​లో ఉన్నారు. పుదుచ్చేరిలో సైతం బీజేపీ అధికారం దిశగా సాగుతోంది. 23 స్థానాల్లో ఆ పార్టీ లీడ్​లో ఉంది. డీఎంకే 5 చోట్ల అధిక్యంలో కొనసాగుతోంది. అస్సాం, బెంగాల్​, పుదుచ్చేరిలో కాషాయ జెండా రెపరెపలాడనున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి..: Assam Election Results | అస్సాంలో హ్యాట్రిక్​ దిశగా బీజేపీ.. 91 స్థానాల్లో అధిక్యం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *