అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM Modi | దేశ విభజనపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన పార్టిషన్ హరర్స్ రిమంబరెన్స్ డే సందర్భంగా మాట్లాడారు. విభజన సమయంలో బాధపడిన వారికి నివాళులు అర్పించారు. అపారమైన నష్టం ఎదురైనప్పటికీ తమ జీవితాలను పునర్నిర్మించుకున్న ప్రజల ధైర్యాన్ని ఆయన స్మరించుకున్నారు.
దేశ విభజన ఎన్నో జీవితాలను ఛిన్నాభిన్నం చేసిన ఘట్టం అని ప్రధాని పేర్కొన్నారు. అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యాయని గుర్తు చేసుకున్నారు. ప్రియమైన వారిని కోల్పోయారు, అపారమైన బాధను అనుభవించారన్నారు. దీనిని అధిగమించి, ప్రజలు ఏమీ లేని స్థితి నుండి తమ జీవితాలను పునర్నిర్మించుకున్నారని పేర్కొన్నారు. మన దేశ ప్రగతికి అపారంగా దోహదపడ్డారన్నారు.
PM Modi | క్రూరమైన అధ్యాయం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) కూడా దేశ విభజన బాధితులను స్మరించుకున్నారు. 1947 ఆగస్టు 14వ తేదీని చరిత్రలోనే అత్యంత క్రూరమైన అధ్యాయాలలో ఒకటిగా అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ రోజున లక్షలాది మంది ప్రజలు అమానుషమైన బాధలను అనుభవిస్తూ తమ ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చిందన్నారు. కోట్లాది మంది తమ ఇళ్లను, ఆస్తులను, ప్రియమైన వారిని వదిలి నిరాశ్రయులుగా మారారన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు.
ఇది కూడా చదవండి..: Rahul Gandhi BJP Criticism | ఇంకా ఎప్పుడు ఎదుగుతారు.. రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలు