NALSAR University Controversy | నల్సార్​ యూనివర్సిటీ వివాదం.. సీజేఐ కీలక వ్యాఖ్యలు

నల్సార్​ యూనివర్సిటీ వివాదంపై చీఫ్​ జస్టిస్​ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: NALSAR University Controversy | భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ సూర్యకాంత్​ (Justice Suryakant)కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని నల్సార్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైన విద్యార్థులను చేర్చుకోవద్దని అన్ని రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు ఆదేశాలు జారీ చేసిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు “వెనక్కి తగ్గండి” అని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ మిశ్రా సందేశం పంపారు.

నల్సార్​ యూనివర్సిటీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్​ డేకు సీజేఐని ఆహ్వానించొద్దని యాజమాన్యానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన బీసీఐ విద్యార్థులు చేపట్టిన ప్రచారంపై విచారణ పూర్తయ్యే వరకు పట్టభద్రుల నమోదును నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు జారీ చేసిన కొన్ని గంటల్లోనే, 2026 నల్సార్ పట్టభద్రులలో అత్యధికులు నిర్దోషులని, ప్రధాన న్యాయమూర్తిని అగౌరవపరిచే ఏ చర్యలోనూ పాల్గొనేందుకు వారు సుముఖంగా లేరని తమ తాజా సమాచారం సూచిస్తోందని BCI పేర్కొంది.

NALSAR University Controversy | జోక్యం చేసుకోవడానికి వారెవరు

బీసీఐ ఉత్తర్వులపై సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా అనవసరం. నేను కూడా ఒకప్పుడు నిరసనల్లో చురుకుగా పాల్గొన్న విద్యార్థిని. ఇది నాకు, విద్యార్థులకు సంబంధించిన అంశం. ఇందులో జోక్యం చేసుకోవడానికి వాళ్లెవరు అని బీసీఐని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. BCI సర్క్యులర్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసర విచారణకు స్వీకరించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. నల్సార్ విద్యార్థులు, అధ్యాపకులపై ఎలాంటి శిక్షాత్మక చర్యలు తీసుకోకూడదని పేర్కొంటూ, బీసీఐ (BCI) జారీ చేసిన సర్క్యులర్లపై సుప్రీంకోర్టు వివరణ కోరింది. బీసీఐ తరఫున హాజరైన న్యాయవాది, ఆ సర్క్యులర్‌ను ఉపసంహరించుకున్నట్లు ధర్మాసనానికి తెలిపారు.

ఇది కూడా చదవండి..: Eagle Force | ఈగల్ టీమ్‌పై కుక్కను వదిలిన గంజాయి ముఠా

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *