అక్షరటుడే, పెద్దకొడప్గల్: Hanmanth Shinde Birthday | తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలని.. వారిని మించిన దైవం లేదని జుక్కల్ (Jukkal) మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పేర్కొన్నారు. శుక్రవారం తన జన్మదినం సందర్భంగా ఆయన డోన్గావ్లో పర్యటించారు.
Hanmanth Shinde Birthday | తల్లి నుంచి ఆశీర్వాదాలు
డోన్గావ్లో తన స్వగృహంలో ఉన్న తల్లికి పాదాభివందన చేసిన మాజీ ఎమ్మెల్యే ఆమె ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులకు సేవ చేస్తే దేవుడికి చేసినట్లేనన్నారు. వృద్ధాప్యంలో వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని సూచించారు. హన్మంత్ షిండే జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు సంబురాలు నిర్వహించారు. పలుచోట్ల కేక్‌లు కట్ చేసి పంచిపెట్టారు.
ఇది కూడా చదవండి..: Shadow Sarpanch | సర్పంచ్ భర్తల పెత్తనం.. ఫిర్యాదు చేస్తున్న గ్రామస్తులు