అక్షరటుడే, ఇందూరు: Nizamabad Tiranga Rally | తిరంగా ర్యాలీతో అందరి గుండె నిండా దేశభక్తి ఉప్పొంగిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా నుంచి గాంధీ చౌక్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు.
Nizamabad Tiranga Rally | ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో..
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఒకప్పుడు కేవలం స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డే రోజు మాత్రమే జాతీయ జెండాలను ఆవిష్కరించే వారన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పిలుపుమేరకు 2022లో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. దీంతో ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోందన్నారు. ఇలాంటి కార్యక్రమం వల్ల దేశభక్తి పెంపొందడమే కాకుండా స్వాతంత్య్ర సమరయోధుల చరిత్ర తెలిసే అవకాశం ఉంటుందన్నారు. ప్రధానంగా కులం మతం ప్రాంతం అనే భేదాలు లేకుండా భారతీయుల ఐక్యత కోసం రూపొందించిన కార్యక్రమం అన్నారు. యువతలో జాతీయ భావాన్ని పెంపొందించడం దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యాన్ని పెంచడం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
Nizamabad Tiranga Rally | స్వాతంత్య్ర సమరయెధుల పాఠాలు..
యువత స్వాతంత్ర సమరయోధుల పాఠాలు చదవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సూచించారు. చిన్న వయసులో ప్రాణాలర్పించిన భగత్ సింగ్, ఉద్దం సింగ్, చంద్ర శేఖర్ ఆజాద్ తదితరుల చరిత్రను తెలుసుకోవాలన్నారు. దేశానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన ఊరుకునేది లేదన్నారు. మతాల మధ్య చిచ్చు పెడితే వదిలేది లేదని పేర్కొన్నారు. రంగా ర్యాలీలో ఆయా పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Hanmanth Shinde Birthday | తల్లిదండ్రులను మించిన దైవం లేదు