అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Cabinet Meeting | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy )అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ కీలక భేటీకి మంత్రులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు. అయితే, స్వల్ప అస్వస్థత కారణంగా మంత్రి దామోదర రాజనర్సింహ, నగరంలో అందుబాటులో లేకపోవడం వల్ల మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక సమస్యలు, ప్రతిపాదిత ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.
Telangana Cabinet Meeting |కీలక అంశాలపై చర్చ..
రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 22ఏ నిషేధిత భూముల సమస్యపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మెట్రో రైల్ రెండో దశ విస్తరణ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహార పదార్థాలు, మందుల కల్తీని అరికట్టేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నిర్వహణ, రహదారి భద్రతను మెరుగుపరిచే దిశగా ‘ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో’ (TMARS) ఏర్పాటును ఆమోదించే అవకాశం ఉంది. చివరగా, రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాల పురోగతి, లబ్ధిదారుల ఎంపిక, బడ్జెట్ కేటాయింపులపై కూడా కేబినెట్ సమీక్ష జరపనుంది.
ఇది కూడా చదవండి: Karur Stampede Case | కరూర్ బాధితులకు బిగ్ రిలీఫ్ .. మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే!