అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana Heavy Rain | తెలంగాణ (Telangana)లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. నాలుగు రోజులుగా పడుతున్న వానలతో వాగులు, వంకలు పారుతున్నాయి. నేడు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ వానలు విస్తారంగా పడుతాయని అధికారులు తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, సిద్దిపేట, జనగామ, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, నారాయణపేట జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
Telangana Heavy Rain | వర్షపాతం వివరాలు
రాష్ట్రంలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో అత్యధికంగా 77.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. సంగారెడ్డిలో 71.8, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి 70.8, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ 61, మెదక్ జిల్లా పాపన్నపేట 59.8, వికారాబాద్ జిల్లా పూడురు 56.3, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట 47.5, కామారెడ్డి జిల్లా మద్నూర్‌లో 42.3మీ.మీ. వర్షం కురిసింది.
ఇది కూడా చదవండి..: Bandi Sanjay Revanth | తెలంగాణలో జెన్-జీని మినిస్టర్‌గా చేయండి : బండి సంజయ్ సవాల్