KTR Sensational Comments | రేవంత్ రెడ్డి స్థాయికి మేమే ఎక్కువ.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమంత్రికి ప్రతిపక్షాన్ని ఎదుర్కునే ధైర్యం లేదని కేటీఆర్​ అన్నారు. చర్చకు వస్తామని చెప్పి కాంగ్రెస్​ నాయకులు పారిపోయారన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR Sensational Comments | బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చకు రావాలని తాము సీఎం రేవంత్​రెడ్డికి, రాహుల్​ గాంధీకి సవాల్ విసిరామన్నారు. సందెట్లో సడేమియాలా మధ్యలో జూపల్లి వచ్చారని ఎద్దేవా చేశారు. రేవంత్​రెడ్డి (Revanth Reddy) స్థాయికి తామే ఎక్కువని, కేసీఆర్​ రావాలంటే రాహుల్ గాంధీ రావాలన్నారు.

తెలంగాణ భవన్​ వద్ద కేటీఆర్​ మీడియాతో మాట్లాడారు. బీఆర్​ఎస్​ హయాంలో చేసిన అప్పులపై తాము సీఎంకు సవాల్​ విసిరితే, తాను చర్చకు వస్తానని జూపల్లి చెప్పారన్నారు. తెలంగాణ భవన్​కు వస్తానని ఆయన అనడంతో తాము ఆధారాలో వచ్చినట్లు తెలిపారు. అయితే తీరా ఇక్కడకు వచ్చాక గన్​పార్కుకు రావాలన్నారని విమర్శించారు. అక్కడకు వెళ్తుంటే మాజీ మంత్రి హరీశ్​రావును అరెస్ట్​ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

KTR Sensational Comments | సీఎంకు ధైర్యం లేదు

ముఖ్యమంత్రికి ప్రతిపక్షాన్ని ఎదుర్కునే ధైర్యం లేదని కేటీఆర్​ అన్నారు. గతంలో ప్రెస్‌క్లబ్‌కు రావాలని సీఎం సవాల్ విసిరారని, సవాల్‌ను స్వీకరించి వెళ్తే అప్పుడు ఆయన రాలేదని గుర్తు చేశారు. అప్పులపై చర్చకు రావాలని మొన్న సీఎం సవాల్‌ విసిరాని, తాను సవాల్‌కు సిద్ధమని ప్రకటించానని తెలిపారు. మధ్యలో వచ్చిన జూపల్లి తెలంగాణ భవన్​కు వస్తానని చెప్పి, ఎక్కడో మాట్లాడుతున్నారని విమర్శించారు.

KTR Sensational Comments | ఇంత భయం ఎందుకు

సంక్షేమ శాఖలో రూ.2000 కోట్ల కుంభకోణంపై హరీష్ రావు (Harish Rao) ఆరోపణలు చేస్తే చర్చ కోసం ముగ్గురు మంత్రులు గన్ పార్క్ దగ్గరికి రమ్మన్నారని కేటీఆర్​ పేర్కొన్నారు. వారితో మాట్లాడడానికి హరీష్ రావు బయలుదేరితే తెలంగాణ భవన్ బయటే అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఇంత భయం ఎందుకని ప్రశ్నించారు. కావాలంటే అసెంబ్లీ పెట్టండి. అక్కడే చర్చిద్దామన్నారు. చర్చలని మీరే పిలుస్తారు.. మళ్లీ పారిపోయేది మీరే అని ఎద్దేవా చేశారు. తాను గన్​ పార్క్​ వద్దకు వస్తానని, అక్కడే ఉండాలన్నారు.

KTR Sensational Comments | కేటీఆర్​ను అడ్డుకున్న పోలీసులు

ప్రెస్​మీట్​ అనంతరం తెలంగాణ భవన్ నుంచి గన్ పార్క్ వద్దకు వెళ్తున్న కేటీఆర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మరోసారి పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు మద్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు ఇప్పటికే హరీశ్​రావును అరెస్ట్​ చేసి కంచన్​బాగ్​ పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

ఇది కూడా చదవండి : Harish Rao Arrest | హరీశ్​రావును అడ్డుకున్న పోలీసులు.. తెలంగాణ భవన్​ వద్ద ఉద్రిక్తత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
3 Comments