అక్షరటుడే వెబ్‌డెస్క్: VB-G RAM-G Scheme | గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘VB-G RAM-G’ పథకం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ కొత్త సంక్షేమ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా ముక్కావారిపల్లె వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం ఘనంగా ప్రారంభించారు.
VB-G RAM-G Scheme | పని దినాల పెంపు..
గ్రామీణ ఉపాధి కల్పనే ధ్యేయంగా జులై 1 నుంచి అమలులోకి వచ్చిన ఈ పథకం కూలీలకు ఎంతో మేలు చేయనుంది. ఈ పథకం ద్వారా, ఉపాధి హామీ పని దినాలను 125 రోజులకు పెంచారు. రోజువారీ వేతనాన్ని రూ. 312గా నిర్ణయించారు. ఈ నిర్ణయంతో గ్రామీణ కూలీల ఆదాయం పెరగడమే కాకుండా, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

VB-G RAM-G Scheme | ప్రత్యేక ప్రదర్శనలు..
పథకాన్ని ప్రారంభించిన అనంతరం, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రులు సభా ప్రాంగణం వద్ద మొక్కలు నాటారు. అనంతరం గ్రామీణ పారిశుద్ధ్యం, జల సంరక్షణ కోసం చేపట్టిన ‘స్వచ్ఛ రథాలు’, ఆధునిక ‘మ్యాజిక్ డ్రైన్ల’ పనితీరును వారు పరిశీలించారు. అలాగే, జల సంరక్షణ ప్రాముఖ్యతను వివరించే ఫోటో గ్యాలరీని కూడా వారు తిలకించారు.
VB-G RAM-G Scheme | గ్రామీణ భారత్ అభివృద్ధి..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కేంద్రంతో కలిసి గ్రామీణ ప్రాంతాల ముఖచిత్రాన్ని మార్చేందుకు ఈ పథకం ఒక మైలురాయిగా నిలుస్తుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధి కల్పన ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.
Andhra Pradesh
Tirupati
Launches ‘VB-G RAM-G’ Scheme
CM Chandrababu Naidu, Dy CM Pawan Kalyan, and Union Minister Shivraj Singh Chouhan launched the Centre’s ‘VB-G RAM-G’ scheme in Tirupati district.
Daily labor wage raised to ₹312
Annual workdays increased to 125 days pic.twitter.com/srAQQtxvkj— Gummalla Lakshmana (@GUMMALLALAKSHM3) July 2, 2026
ఇది కూడా చదవండి: Educational Institution Attacks | విద్యాసంస్థలపై దాడి చేస్తే క్రిమినల్ కేసులు : సీపీ సాయిచైతన్య