India US Trade Deal | ట్రేడ్ డీల్‌పై ఆర్థిక మంత్రి సంచలన ప్రకటన.. ఇక ఆశలు వదులుకోవాల్సిందేనా?

భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా తుదిరూపు సంతరించుకోలేదు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: India US Trade Deal | భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా తుదిరూపు సంతరించుకోలేదు. ఇరు దేశాల మధ్య పలుసార్లు చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన బిజినెస్ లీడర్స్ సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  మాట్లాడారు. ప్రస్తుతం ఈ ట్రేడ్ చర్చలు ఒక దశలో నిలిచిపోయినట్లు కనిపిస్తున్నాయని, ఇకపై ఇరు దేశాల మధ్య రాయితీలు ఇచ్చుకోవడం దాదాపు అసాధ్యంగా మారిందని పేర్కొన్నారు.

India US Trade Deal | పీఠముడి పడింది..

ట్రేడ్ డీల్ కోసం చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ఇరుపక్షాల మధ్య పీఠముడి పడినట్లు అనిపిస్తోందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. పరిస్థితి చూస్తుంటే చర్చల పురోగతి ఆగిపోయినట్లు ఉందని, అయితే అందుబాటులో ఉన్న అవకాశాలను బట్టి భవిష్యత్తులో చర్చలు ముందుకు వెళ్లే అవకాశం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

India US Trade Deal | టారిఫ్‌లను ఆయుధంగా ..

భారత్‌తో ఉన్న వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు అమెరికా సంప్రదాయ చర్చల పద్ధతి కాకుండా.. టారిఫ్‌లను ఒక ఆయుధంలా వాడుతోందని ఆర్థిక మంత్రి విమర్శించారు. ఇదే సమయంలో ఈ ఏడాది ఆరంభంలో కుదిరిన భారత్-ఈయూ (EU) వాణిజ్య ఒప్పందం ఎంతో విజయవంతమైందని, దీనివల్ల మన దేశంలోని చిన్న, మధ్యతరగతి పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.

India US Trade Deal | మార్కెట్లపై ప్రభావం..

భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌‌పై నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలతో భారత స్టాక్‌ మార్కెట్లు ఒక్కసారిగా ఊగిసలాటకు గురయ్యాయి. ఉదయం ఆరంభంలో ఒక దశలో భారీ లాభాలతో ట్రేడ్ అయిన సెన్సెక్స్, ఈ వ్యాఖ్యల నేపథ్యంలో గరిష్ఠ స్థాయి నుంచి సుమారు 450 పాయింట్ల వరకు పతనమైంది. ఆ తర్వాత కోలుకుని లాభాల బాటలో కొనసాగింది.

ఇది కూడా చదవండి:  Singareni Workers | సింగరేణి కార్మికులకు ఇన్​కమ్​ ట్యాక్స్​ రద్దు చేయాలి : కవిత

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *