Kamareddy Power Cut | కరెంట్ కోతలపై రైతుల ఆగ్రహం.. కామారెడ్డి-సిరిసిల్ల రహదారిపై రాస్తారోకో

వ్యవసాయానికి ఇస్తున్న కరెంట్ కోతపై పాల్వంచ మండల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Power Cut | కరెంట్ కోతలపై పాల్వంచ మండల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కామారెడ్డి–సిరిసిల్ల ప్రధాన రహదారిపై సోమవారం రాస్తారోకో చేశారు.

మండలంలోని వెల్పుగొండ, ఫరీద్ పేట విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలోని పదులసంఖ్యలో గ్రామాల రైతులు సోమవారం ఉదయం కామారెడ్డి – సిరిసిల్ల ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో గంటపాటు రాకపోకలు స్తంభించాయి. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి కేవలం 12 గంటల విద్యుత్ సరఫరా చేస్తుండటం, అందులోనూ నాణ్యత లోపించడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు (Farmers) ఆవేదన వ్యక్తం చేశారు. వోల్టేజ్ హెచ్చుతగ్గులతో పంపుసెట్లు కాలిపోతున్నాయని, మోటార్లు రిపేర్ చేయించడానికే వేల రూపాయలు ఖర్చవుతోందని వాపోయారు. సరైన సమయంలో నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, ఇటు పంటనష్టం, అటు ఆర్థికభారం మోయలేకపోతున్నామని అన్నారు. 12 గంటల కరెంటులో కూడా సాంకేతిక కారణాలు, లైన్ మెయింటెనెన్స్, ట్రిప్పింగ్ పేరుతో అంతరాయం ఏర్పడడంతో 10 గంటలు కూడా పూర్తిస్థాయిలో విద్యుత్ రావడం లేదని రైతులు పేర్కొన్నారు.

Kamareddy Power Cut | రాత్రిపూట కరెంట్ ఇవ్వడంతో..

రాత్రిపూట కరెంట్ ఇవ్వడం వల్ల పొలాల వద్దకు వెళ్లడానికి భయపడాల్సి వస్తోందని, పాము, తేలు భయంతో పాటు విద్యుత్ షాక్ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రాస్తారోకో సందర్భంగా రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ అంటేనే కరెంటు కోత అంటూ, ఈ పాలన వద్దు.. సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. మొన్నటి వరకు యూరియా కోసం క్యూలైన్లలో నిలబడ్డామని, ఇప్పుడు కరెంటు కోసం రోడ్డెక్కాల్సి వస్తోందన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఎన్పీడీసీఎల్ ఏఈ, డీఈలు ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. విద్యుత్ సమస్యను పరిష్కరిస్తామని, నాణ్యమైన కరెంట్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

ఇదికూడా చదవండి: Bar Owners Protest | జిల్లాలో బార్లు బంద్​.. ఎందుకో తెలుసా..?

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *