అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: NHM Employees Strike | ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఎన్హెచ్ఎం (NHM) ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు జిల్లా కేంద్రంలోని (Nizamabad) ధర్నా చౌక్ వద్ద కొనసాగుతోంది. శనివారం జిల్లా ఆయుష్ ఉద్యోగులు ఈ సమ్మెకు మద్దతు పలికారు.
NHM Employees Strike | వారిని వెంటనే రెగ్యులర్ చేయాలి..
ఈ సందర్భంగా తెలంగాణ ఆయుష్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు న్యావనంది పురుషోత్తం పటేల్ మాట్లాడుతూ..ఎన్హెచ్ఎం ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న వివిధ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు జ్యోత్స్న, సుబూర్, ఉమా, ఫార్మసిస్టులు బాబురావు, నవనీత, ఆయుష్ ఉద్యోగులు భిక్షపతి, సుజాత, ఆస్మా వేగం, సురేందర్, రమేష్, ఎన్హెచ్ఎం ఉద్యోగులు సందీప్, విశాల, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: దుల్కర్ కొత్త మ్యాజిక్..టీజర్ అదుర్స్..!