అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad RTFMS System | రియల్‌టైమ్ ఫీడర్ మానిటరింగ్ సిస్టమ్ (RTFMS) ద్వారా జిల్లాలో వినియోగదారులకు మరింత నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సేవలు అందుతాయని నిజామాబాద్(Nizamabad) ట్రాన్స్‌కో (TGNPDCL) ఎస్ఈ పీవీ రాజేశ్వర్ రావు తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటనలో తెలిపారు.
Nizamabad RTFMS System | నిజామాబాద్ సర్కిల్లో..
నిజామాబాద్ సర్కిల్ పరిధిలోని 139 సబ్స్టేషన్లను స్కాడా (SCADA) వ్యవస్థతో అనుసంధానం చేయగా, మరో 20 సబ్స్టేషన్ల పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. విద్యుత్ అంతరాయాలు, ఓవర్‌లోడ్, వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఏర్పడితే స్కాడా కంట్రోల్ రూమ్‌కు వెంటనే రియల్‌టైమ్ అలర్టులు వస్తాయని పేర్కొన్నారు. వేగవంతమైన పరిష్కారం: క్షేత్రస్థాయి సిబ్బంది తక్షణమే స్పందించి సమస్యలను వేగంగా పునరుద్ధరించడానికి వీలవుతుందన్నారు. లోడ్, విద్యుత్ వినియోగాన్ని విశ్లేషించి సాంకేతిక లోపాలను ముందే గుర్తించవచ్చు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే లక్ష్యంగా సంస్థ పనిచేస్తోందని ఎస్ఈ వివరించారు.
ఇది కూడా చదవండి: దుల్కర్ కొత్త మ్యాజిక్..టీజర్ అదుర్స్..!