Naikpod Students Issues | నాయక్‌పోడ్ విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

నాయక్‌పోడ్ విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నెట్​వర్క్​: Naikpod Students Issues | నాయక్‌పోడ్ విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (MLA Paidi Rakesh Reddy) పేర్కొన్నారు. ఆదివాసీ నాయక్‌పోడ్ విద్యార్థులు, నిరుద్యోగులు కుల ధ్రువీకరణ (క్యాస్ట్ వెరిఫికేషన్) ప్రక్రియలో ఎదుర్కొంటున్న సమస్యలను సచివాలయంలో ఎమ్మెల్యేకు వివరించారు.

Naikpod Students Issues | న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం..

జిల్లా ఆదివాసి నాయక్​పోడ్​ సేవాసంఘం అధ్యక్షుడు గాండ్ల రాంచందర్​ మాట్లాడుతూ.. నాయక్​పోడ్​ సమస్యలపై ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి వెంటనే స్పందించారన్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్​తో ఫోన్​లో మాట్లాడారని.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నాయక్‌పోడ్ విద్యార్థులకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. వారు రాకేష్​రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షుడు బండారి భోజన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: అక్రమ బోర్‌వెల్స్‌పై HYDRAA చర్యలు.. 

 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *