అక్షరటుడే వెబ్‌డెస్క్: Hansgrohe India Expansion | జర్మనీకి చెందిన ప్రముఖ బాత్‌రూమ్ సొల్యూషన్స్ బ్రాండ్ ‘హాన్స్‌గ్రోహె ఇండియా’ (Hansgrohe India) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తన వ్యాపారాన్ని వేగంగా విస్తరించేందుకు సిద్ధమైంది. రాబోయే రెండేళ్లలో హైదరాబాద్ తో పాటు తెలంగాణ ( Telangana )ప్రాంతంలో రెండంకెల వృద్ధిని సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకుంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కలిపి ఈ బ్రాండ్‌కు 17 స్టోర్లు ఉండగా, వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ఆ సంఖ్యను 22కు పెంచాలని నిర్ణయించింది.
Hansgrohe India Expansion | ‘డెవలపర్ డైలాగ్’ భేటీ..
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో తన పట్టును మరింత బలోపేతం చేసుకునే క్రమంలో ఐటీసీ కోహినూర్‌లో ‘డెవలపర్ డైలాగ్’ పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ భేటీకి నగరం నుంచి 50 మందికి పైగా ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్లు, పరిశ్రమ ప్రతినిధులు హాజరయ్యారు. మారుతున్న వినియోగదారుల అలవాట్లు, ఆధునిక ఇళ్ల రూపకల్పనలో కొత్త డిజైన్లు, సాంకేతికత పాత్రపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన లావాపురా ఎలిమెంట్ ఎస్, అవలెగ్రా ఆక్వాయూనిట్ ఉత్పత్తులు అందరినీ ఆకట్టుకున్నాయి.
Hansgrohe India Expansion |హైదరాబాద్ కీలక మార్కెట్..
భారతదేశంలో మారుతున్న నివాస రంగంలో హైదరాబాద్ అత్యంత కీలకమైన మార్కెట్‌గా మారిందని హాన్స్‌గ్రోహె ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్‌ఖాదర్ బెంగాలీ తెలిపారు. నాణ్యమైన, ఆధునిక డిజైన్లతో కూడిన ఇళ్లకు ఇక్కడ ప్రాధాన్యం పెరుగుతోందన్నారు. నీటి వినియోగ అనుభవాలను మెరుగుపరచడంలో 125 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న హాన్స్‌గ్రోహెకు డెవలపర్లతో ఇటువంటి చర్చలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
Hansgrohe India Expansion | పెరిగిన ఆదరణ..
దక్షిణ భారతదేశంలో లగ్జరీ రియల్ ఎస్టేట్‌కు హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారుతోందని కంపెనీ కమర్షియల్ డైరెక్టర్ విశాల్ గుప్తా చెప్పారు. గృహ కొనుగోలుదారులు తమ ఇళ్లతో పాటు బాత్‌రూమ్‌ల స్థలాల్లోనూ ఉన్నత స్థాయి సదుపాయాలు, కొత్త డిజైన్లను కోరుకుంటున్నారని తెలిపారు. నగరానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు కార్తీష్ రెడ్డి, శేఖర్ రెడ్డి, ఆదిత్య సిహెచ్, కొండయ్య, విశాల్ రెడ్డి, వర్ధన్ రెడ్డి, మురళీకృష్ణ, అభిజీత్ రెడ్డి, మధురం రెడ్డి, ప్రవీణ్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఇది కూడా చదవండి: PM Rahat Scheme | పీఎం రాహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి