Delhi High Court Protest | పాలన మార్పు ఎందుకు కోరుకుంటున్నారు?.. సీజేపీ నేతలకు ఢిల్లీ హైకోర్టు షాకింగ్ ప్రశ్నలు

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాల బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో తీవ్రస్థాయి విచారణ జరిగింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Delhi High Court Protest | కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాల బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో తీవ్రస్థాయి విచారణ జరిగింది. విచారణ సందర్భంగా జస్టిస్ సుబ్రమనియం ప్రసాద్ నేతృత్వంలోని ధర్మాసనం నిందితుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పలు ఘాటు ప్రశ్నలు సంధించింది.

Delhi High Court Protest| నిరసనలు ఎందుకు?

జంతర్ మంతర్ వద్ద నిరసనలకు అధికారికంగా అనుమతులు రద్దు చేసినప్పటికీ, అక్కడికే ఎందుకు వెళ్లారని ధర్మాసనం ప్రశ్నించింది. పోలీసులు రామ్‌లీలా మైదాన్, బురారీ మైదాన్ వంటి ప్రత్యామ్నాయ ప్రదేశాలను సూచించినప్పుడు, కేవలం 2 కిలోమీటర్ల దూరంలోని ఆ ప్రాంతాల్లో ఆందోళన చేయడానికి ఉన్న అభ్యంతరం ఏంటని నిలదీసింది.

“మీరు అసలు ఎవరు? పూచీకత్తు (Bond) నిబంధనలను ఎందుకు ఉల్లంఘించారు? దేశంలో పాలన మార్పు (Regime Change) ఎందుకు కోరుకుంటున్నారు? శాంతిభద్రతల విఘాతంపై స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (SEM) కచ్చితంగా దృష్టి సారించాలి” అని కోర్టు వ్యాఖ్యానించింది. అలాగే, SEM ఇచ్చిన ఆదేశాలను నేరుగా హైకోర్టులో సవాలు చేయడానికి బదులు, ముందుగా జిల్లా మేజిస్ట్రేట్‌ను ఎందుకు ఆశ్రయించలేదని పిటిషనర్ల న్యాయవాదిని ప్రశ్నించింది.

Delhi High Court Protest | బారికేడ్లు దాటితే ..

నిరసనల సమయంలో బారికేడ్లను ధ్వంసం చేయడం లేదా దాటడం వల్ల పరిస్థితి అదుపు తప్పుతుందని కోర్టు హెచ్చరించింది. బారికేడ్లను తొలగిస్తే అసాంఘిక శక్తులు చొరబడే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌లో ఇటీవల జరిగిన అల్లర్లను కోర్టు ఉదహరిస్తూ.. అక్కడ విద్యార్థుల నిరసనగా మొదలై చివరికి దోపిడీలు, హింసాత్మక ఘటనలకు దారితీసిందని గుర్తుచేసింది. నిరసనలకు పోలీసుల అనుమతి అనేది కేవలం ఆంక్షల కోసం కాదని, ప్రజా భద్రత, శాంతిభద్రతల నిర్వహణ కోసమని స్పష్టం చేసింది.

Delhi High Court Protest | “మీరు జెన్-జీ కాదు..

విచారణ సందర్భంగా సీజేపీ నేతల వయస్సు ప్రస్తావనకు రాగా.. సౌరవ్ దాస్ వయసు 27 ఏళ్లు, అశుతోష్ రాంకా వయసు 31 ఏళ్లని న్యాయవాది తెలిపారు. దీనిపై కోర్టు స్పందిస్తూ, వీరిని ‘జెన్-జీ’ (Gen-Z) గా పరిగణించలేమని, వీరు ‘మిలీనియల్స్’ (Millennials) అని సరదాగా వ్యాఖ్యానిస్తూనే బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడంపై మండిపడింది.

ఇది కూడా చదవండి: Nizamabad Dasara Sammelanam | 23న జిల్లా మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ‘దసరా సమ్మేళనం’

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *