France Riots | ఫ్రాన్స్​లోని అల్లర్లకు, భారత్​లో నిరసనలకు మధ్య సంబంధం!

ఫ్రాన్స్‌లోని అల్లర్లకు, భారత్​లో సీఈసీ వ్యతిరేక నిరసనలకు మధ్య సంబంధం ఉందని ఫాక్స్ న్యూస్ నివేదికను బయటపెట్టింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : France Riots | ఫ్రాన్స్‌లోని అల్లర్లకు, భారత్​లో సీఈసీ వ్యతిరేక నిరసనలకు మధ్య సంబంధం ఉందని పేర్కొన్న ఓ నివేదికను ఆధారంగా చేసుకొని బీజేపీ గురువారం కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.

ఫాక్స్ న్యూస్ డిజిటల్ సంచలన నివేదికను బయట పెట్టింది. 13 దేశాలకు చెందిన 101 సంస్థలు.. నిరసనలను ప్రోత్సహిస్తున్నాయని పేర్కొంది. ఆందోళనలు తీవ్రరూపం దాల్చేలా చేస్తున్నాయని ఆరోపించింది. ఫ్రాన్స్‌లోని అశాంతికి, భారత్​, ఇతర దేశాలలో యువత నేతృత్వంలోని ప్రదర్శనలకు మధ్య సంబంధాలను వెల్లడించింది. ఈ నివేదిక ఆధారంగా కాంగ్రెస్​పై బీజేపీ విమర్శలు చేసింది.

France Riots | కాంగ్రెస్​ కుట్ర

ఈ నివేదిక కాంగ్రెస్ ‘అరాచకత్వం, ప్రభుత్వ మార్పు కుట్రను’ బట్టబయలు చేస్తుందని బీజేపీ గురువారం పేర్కొంది. రాహుల్ గాంధీని ద్రోహి అని అభివర్ణించింది. బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ దేశం ముందు అరాచకత్వాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఈ ద్రోహుల నాయకుడు ఎవరు అని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడు బాధ్యతారహితంగా, అపరిపక్వంగా ఉండటం దేశ దురదృష్టం అన్నారు.

France Riots | ప్రభుత్వాలను కూల్చే యత్నం

ఫ్రాన్స్‌తో సహా తొమ్మిది దేశాలలో ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడానికి కుట్ర జరుగుతుందని ఫ్యాక్స్​ న్యూస్​ తెలిపింది. కమ్యూనిస్ట్​ గ్రూపులు, ఇస్లామిక్​ గ్రూపులతో నిరసనలు చేపడుతున్నట్లు పేర్కొంది. ఇందుకోసం 101 సంస్థలు పని చేస్తున్నాయన్నారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ విదేశీ ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తుల రిమోట్ కంట్రోల్‌లో ఉన్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ ఆరోపణలపై కాంగ్రెస్​ స్పందించలేదు.

దీనిని కూడా చదవండి : ACB Case | బిల్లుల కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన అధికారులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *