అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Case | జయశంకర్ భూపాలపల్లికి జిల్లాకు చెందిన ఇద్దరు అధికారులపై ఏసీబీ (ACB) కేసు నమోదు చేసింది. బిల్లుల చెల్లింపు కోసం లంచం తీసుకున్నారనే ఆరోపణల మేరకు అధికారులు విచారణ జరిపి వారిని అదుపులోకి తీసుకున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రధాన్ మంత్రి కృషి సించాయ్ యోజన (PMKSY 2.0)లో భాగంగా భాగీరతిపేట ప్రాజెక్ట్ పనుల బిల్లుల కోసం అధికారులు లంచం డిమాండ్ చేశారు. ప్రాజెక్ట్ ఆఫీసర్ సతీష్‌రెడ్డి, టెక్నికల్ ఆఫీసర్ రాజు లంచం తీసుకున్నారని ఏసీబీకి ఫిర్యాదు అందింది. PMKSY 2.0 పథకం కింద చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను ప్రాసెస్ చేయడానికి, మళ్లీ పనుల కేటాయింపు కోసం అధికారులు ఒక కాంట్రాక్టర్ నుంచి అక్రమంగా లంచం డిమాండ్ చేశారు. బిల్లు మొత్తాలపై 10 శాతం నుంచి 25 శాతం వరకు లంచం అడిగారని ఫిర్యాదు రావడంతో అధికారులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.
ACB Case | డబ్బులు ఇస్తేనే..
డిమాండ్ చేసిన మొత్తాలను చెల్లించకపోతే పెండింగ్‌లో ఉన్న బిల్లులను ప్రాసెస్ చేయబోమని, తదుపరి పనులు కేటాయించబోమని అధికారులు బెదిరించారు. దీంతో సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీబీ అధికారులు వారి బ్యాంక్ ఖాతాలను పరిశీలించారు. నిందితుల బ్యాంకు ఖాతాలు/యూపీఐ ఖాతాలకు మొత్తం రూ.39.17 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించారు. బాధితుడు సైతం తాను డబ్బులు పంపినట్లు ఆధారాలు సమర్పించాడు. బ్యాంక్ స్టేట్మెంట్, వాట్సాప్ చాట్ అధికారులకు ఇచ్చాడు. దీంతో గురువారం ఏసీబీ అధికారులు నిందితులైన సతీష్ రెడ్డి, రాజులను అరెస్ట్ చేశారు.
దీనిని కూడా చదవండి : Indian Stock Market | మూడో రోజూ నష్టాలే..