అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల: Rajanna Sircilla Paddy Prices | వడ్ల ధరలు తగ్గించి కొనుగోలు (Paddy Procurement) చేస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్తాబాద్ మండలం నామాపూర్ గూడెం ప్రధాన కూడలిలో రైతులు ధర్నా నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు.
Rajanna Sircilla Paddy Prices | ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలేవి..?
ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన వడ్ల కొనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు ప్రారంభం కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో తమ ధాన్యాన్ని విక్రయించేందుకు రైస్ మిల్లుల బాట పడుతున్నామన్నారు. ఇదే అదునుగా తీసుకుంటున్న కొందరు మిల్లర్లు వడ్ల ధరలను తగ్గించి కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభించకపోవడం వల్లే రైతులు ప్రైవేటు మిల్లర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మిల్లర్ల ధరల దోపిడీని అరికట్టి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇది కూడా చదవండి: ఇన్‌స్టాలోకి సోనియా గాంధీ.. ఫస్ట్ పోస్ట్ ఇదే!