Additional Collector | అడిషనల్​ కలెక్టర్​ భుజంగరావుకు అదనపు బాధ్యతలు

నిజామాబాద్​ జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)గా కొనసాగిన కిరణ్ కుమార్ మంగళవారం ఉద్యోగ విరమణ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Additional Collector | జిల్లా (Nizamabad) అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)గా కొనసాగిన కిరణ్ కుమార్ మంగళవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు కలెక్టర్​ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi) ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు.

Additional Collector | అడిషనల్​ కలెక్టర్​(రెవెన్యూ)గా..

కిరణ్​కుమార్ రిటైర్​మెంట్​ అయిన నేపథ్యంలో.. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్​గా కొనసాగుతున్న వి.భుజంగరావుకు, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. ఎంతో సమర్ధత కలిగిన అధికారి పదవీ విరమణ చేస్తుండటం జిల్లా యంత్రాంగానికి ఎంతో లోటు అని అన్నారు. తన మొదటి పోస్టింగ్ భద్రాద్రి జిల్లాలో ట్రెయినీ కలెక్టర్ గా ఇదివరకు కిరణ్ కుమార్​తో కలిసి పని చేశానని కలెక్టర్ గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం తాను కలెక్టర్​గా కొనసాగుతున్న నిజామాబాద్ జిల్లాలో ఆయన పదవీ విరమణ చేయడం కాకతాళీయం అన్నారు.

11111

ఇది కూడా చదవండి: అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్‌కు షాక్‌ 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *