Government Employees Degree | ప్రభుత్వ ఉద్యోగులు ముందస్తు అనుమతి లేకుండా రెగ్యులర్ డిగ్రీలు పూర్తి చేస్తే అవి చెల్లవు

జస్టిస్ పి. సామ్ కోశి మరియు జస్టిస్ లక్ష్మణ్ లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారిస్తూ ఈ క్రింది అంశాలను వెల్లడించింది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Government Employees Degree | సర్కారు కొలువులో ఉంటూ ముందస్తు అనుమతి లేకుండా ఉన్నత చదువులు చదివే వారిపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిబంధనల ప్రకారం శాఖాపరమైన అనుమతి తీసుకోకుండా పూర్తి చేసిన LLB (రెగ్యులర్) డిగ్రీని ధృవీకరించలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

Pakistan Afghanistan Conflict | పాకిస్థాన్ వైమానిక దాడులతో ఆఫ్ఘనిస్తాన్​లో ఉద్రిక్తత.. ప్రాంతీయ భద్రతకు కొత్త సవాళ్లు

Government Employees Degree | తిరస్కరణ

ఒక ప్రభుత్వ ఉద్యోగి తన విధుల్లో కొనసాగుతూనే మూడేళ్ల రెగ్యులర్ LLB కోర్సును పూర్తి చేశారు. అయితే, సదరు డిగ్రీని తన సర్వీస్ రిజిస్టర్‌లో నమోదు చేయాలని, పదోన్నతులకు కూడా పరిగణనలోకి తీసుకోవాలని సదరు ఉద్యోగి చేసిన అభ్యర్థనను ఉన్నతాధికారులు తిరస్కరించారు.

దీంతో ఆ ఉద్యోగి హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ పి. సామ్ కోశి, జస్టిస్ లక్ష్మణ్ లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ఈ సందర్భంగా కోర్టు పలు అంశాలను వెల్లడించింది.

judgement

Government Employees Degree | విధుల్లో ఉంటూ రెగ్యులర్​ చదువు ఎలా సాధ్యం?

1978 నాటి ప్రభుత్వ మెమో ప్రకారం.. సర్కారు ఉద్యోగి ఎవరైనా ఉన్నత చదువులు చదవాలనుకుంటే ముందస్తుగా అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని పేర్కొంది. పిటిషనర్ ఈ నిబంధనను పాటించలేదని తెలిపింది.

ఉద్యోగి పనిచేసే చోటుకు, కళాశాలకు మధ్య ఉన్న దూరం (దాదాపు 50 కి.మీ.) దృష్ట్యా, విధులకు ఆటంకం కలగకుండా రెగ్యులర్ కోర్సు చదవడం అనేది సాధ్యం కాదని కోర్టు అభిప్రాయపడింది. ఇది విధి నిర్వహణలో క్రమశిక్షణను దెబ్బతీస్తుందని స్పష్టం చేసింది.

ముందస్తు అనుమతి లేకుండా డిగ్రీ చదివి, తర్వాత దానిని ధృవీకరించాలని కోరడం సమంజసం కాదని, అలాంటి డిగ్రీలు సర్వీస్ ప్రయోజనాలకు పనికిరావని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు పిటిషన్‌ను కొట్టివేసింది.

ఈ తీర్పు ద్వారా సర్కారు ఉద్యోగులు క్రమశిక్షణతో వ్యవహరించాలని, ఉన్నత చదువుల విషయంలో తప్పనిసరిగా సర్కారు అనుమతి పొందాలని హైకోర్టు మరోసారి గుర్తుచేసింది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *