Basara Godavari | బాసర గోదావరిలో విషాదం.. స్నానాలకు దిగిన ముగ్గురు అన్నదమ్ములు గల్లంతు

బాసర గోదావరిలో విషాదం నెలకొంది. నదిలో స్నానాలకు దిగిన ముగ్గురు అన్నదమ్ములు గల్లంతయ్యారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Basara Godavari | బాసర(basara) గోదావరిలో విషాదం నెలకొంది. నదిలో స్నానాలకు దిగిన ముగ్గురు అన్నదమ్ములు గల్లంతయ్యారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది.

Basara Godavari | పుణ్యస్నానాలకు వచ్చిన అన్నదమ్ములు..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్​లోని(Hyderabad)  కాచిగూడ(Kachiguda) చెప్పల్​ బజార్​కు చెందిన చంద్రశేఖర్ (38), రామచందర్ (36), మల్లేష్‌కుమార్ (31)లు ముగ్గురు అన్నదమ్ములు. వీరు తమ కుటుంబాలతో బాసర అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. ముందుగా పుణ్యస్నానాలు చేసేందుకు గోదావరిలో దిగారు. అయితే నీటిలోతు గమనించక వారు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసు బృందం సంఘటనాస్థలానికి చేరుకుంది. ప్రస్తుతం ఎన్డీఆర్​ఎఫ్​ బృందం గల్లంతైన వారికోసం గాలిస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

basar bass11 bgrek

ఇది కూడా చదవండి: Mohan Naik ACB Raid | ఈఎన్‌సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ రైడ్స్.. 100 కోట్ల పైచిలుకు ఆస్తులు?

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *