అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kavitha Singareni Comments | తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత సింగరేణి బాయి బాట కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆమె గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రి సందర్శించారు. అనంతరం హెచ్ఎంఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
ముఖ్యమంత్రి తెలంగాణ ఇజ్జత్ తీయటమే పనిగా పెట్టుకున్నారని కవిత (Kavitha) విమర్శించారు. ఢిల్లీకి అప్పు కోసం పోతే చెప్పులు ఎత్తుకుపోయే వాళ్లను చూసినట్లు చూస్తున్నారని అన్నారని గుర్తు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి తన ఫోన్ ఎత్తటం లేదని చెబుతారన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత బేలగా మాట్లాడుతారా అని ఆమె ప్రశ్నించారు. ఆయన బేలా మాటల కారణంగానే ఆంధ్రాలో ఉండే నాయకులు మనపై పెత్తనం చెలాయించేందుకు మళ్లీ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
Kavitha Singareni Comments | మమ్మల్ని అడ్డుకుంటున్నారు
సింగరేణిలో కార్మికుల కష్టాలు తెలుసుకునేందుకు వస్తే తమను అడ్డుకుంటున్నారని కవిత పేర్కొన్నారు. కార్మికులకు కనీస అవసరాలు తీర్చకుండా ప్రభుత్వం, ఆఫీసర్లు ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు సింగరేణి క్యాంపస్ లోకి పోలీసులే రావద్దు. కానీ వాళ్లను తీసుకొచ్చారంటే కాంగ్రెస్ నేతలు ఎంత తప్పు చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. గనుల్లో కి వెళ్లే కార్మికులకు కనీసం ఆక్సిజన్ కూడా ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు.
Kavitha Singareni Comments | రాజకీయ జోక్యం

సింగరేణిలో రాజకీయ జోక్యం ఎక్కువ కావటంతోనే చిన్న చిన్న సౌకర్యాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని కవిత అన్నారు. సింగరేణి కార్మికులను ఆఫీసర్లు ఇబ్బంది పెడుతుండటం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఆఫీసర్లకే తమ హక్కులు కాపాడుకునేందుకు యూనియన్లు ఉన్నాయని, కార్మికులకు యూనియన్లు ఉండొద్దా అని ప్రశ్నించారు. చిన్న వాటికే మెమోలు అంటూ కార్మికులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. ఆఫీసర్లు మానవీయకోణంలో ఆలోచించాలని సూచించారు.
Kavitha Singareni Comments | కొత్త బ్లాక్‌లు ఇవ్వాలి
కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ సింగరేణికి కొత్త బ్లాక్‌లు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. మూసుకుపోతున్న అండర్ గ్రౌండ్ మైనింగ్‌ను తెరవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటే కుదరదు. అండర్ గ్రౌండ్ మైనింగ్ చేయాల్సిందే అన్నారు. భూగర్భ గనులతో పర్యావరణ పరిరక్షణతో పాటు వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని కవిత తెలిపారు.
ఇది కూడా చదవండి..: Telangana Public School | మెస్సీ రాకపై విమర్శలా? ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్