అక్షరటుడే, కామారెడ్డి : Dubai Driver Jobs | రాష్ట్ర ప్రభుత్వ సంస్థ, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో దుబాయ్ (Dubai)లో క్యాబ్ డ్రైవర్, బైక్ రైడర్ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది.
Dubai Driver Jobs | కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలో..
రాష్ట్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న టామ్‌కామ్ ఈ విదేశీ ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది. ఈ మేరకు జిల్లా ఉపాధి శాఖ అధికారులు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 23 నుంచి 45 ఏళ్ల వయసు ఉండి, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, సంబంధిత డ్రైవింగ్ లేదా రైడింగ్ అనుభవం, ప్రాథమిక స్థాయిలో ఇంగ్లిష్ మాట్లాడగలగడం, చదవగలగడం తెలిసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన క్యాబ్ డ్రైవర్లకు 100 శాతం కమిషన్ ఆధారితంగా నెలకు సుమారు రూ.64,850 నుంచి రూ.1,03,770 వరకు ఆదాయం లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Dubai Driver Jobs | బైక్ రైడర్లకు..
బైక్ రైడర్లకు కూడా 100శాతం కమిషన్ ఆధారంగా నెలకు రూ.64,850 వరకు సంపాదించవచ్చని తెలిపారు. రెవెన్యూ, ట్రిప్‌ల సంఖ్య, పనితీరు ఆధారంగా ఈ ఆదాయం మారుతుందని పేర్కొన్నారు. ఈనెల 25 వరకు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం ఉందని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, నమోదు చేసుకుని ప్రాథమిక స్క్రీనింగ్ కోసం వివరాలను సమర్పించాలని సూచించారు. ఎంపికైన వారికి యజమాని అవసరాలు, పత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు, సీఐడీ/సెక్యూరిటీ క్లియరెన్స్, వీసా ప్రాసెస్, కంపెనీ నిబంధనలకు లోబడి నియామకం ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 9440049520, 9440048590 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
ఇది కూడా చదవండి..: Hello Upasarpanch Program | ‘హలో ఉపసర్పంచ్–చలో హైదరాబాద్’ పోస్టర్ల ఆవిష్కరణ