E Sakshya | పోలీస్​ వ్యవస్థను డిజిటలైజేషన్​ చేయడమే ‘ఈ–సాక్ష్య’ లక్ష్యం: డీజీపీ

పోలీస్​ వ్యవస్థలను డిజిటలైజేషన్ చేయడమే ‘ఈ–సాక్ష్య’ ప్రధాన లక్ష్యమని డీజీపీ సీవీ ఆనంద్​ పేర్కొన్నారు. శాఖలో సీసీటీఎంఎస్ 2.0, ‘ఈ సాక్ష్య’ అమలుపై అన్ని జిల్లాల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: E Sakshya | పోలీస్​ వ్యవస్థలను(Police Digitalization) డిజిటలైజేషన్ చేయడమే ‘ఈ–సాక్ష్య’ ప్రధాన లక్ష్యమని డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand)​ పేర్కొన్నారు.  సీసీటీఎంఎస్ 2.0, ‘ఈ సాక్ష్య’ అమలుపై అన్ని జిల్లాల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు.

E Sakshya | నేర సమాచారానికి సాంకేతికత జోడించి..

సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించేందుకు పోలీస్​శాఖ(Telangana Police) ముందడుగు వేస్తుందన్నారు. ఈ క్రమంలో సీసీటీఎన్ఎస్ 2.0 ద్వారా నేరాలు, నేరస్థుల సమాచారాన్ని వేగవంతంగా నమోదు చేయడం, దర్యాప్తు ప్రక్రియను డిజిటలైజ్ చేయడాన్ని అలవాటుగా చేసుకోవాలన్నారు. ప్రజలకు అందించే సేవలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చడంపై డీజీపీ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో (Telanagana) ఈ-సాక్ష్య వ్యవస్థ ద్వారా నేర సంఘటనలకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను సేకరించడం(Crime Investigation), భద్రపరచడం, కోర్టు విచారణల్లో సమర్పించే విధానాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని సూచించారు.

సంబంధిత అధికారులు ఈ వ్యవస్థల వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండి , క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. వీసీలో జిల్లా నుండి అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్, సీటీసీ ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, మస్తాన్ అలీ, రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​ శ్రీధర్ రెడ్డి, మల్లేష్, సీసీఆర్​బీ ఇన్​స్పెక్టర్​ అంజయ్య, పీసీఆర్​ ఇన్​స్పెక్టర్​ వీరయ్య, సీఐలు, ఎస్సైలు ఐటీ కోర్ సిబ్బంది, స్టేషన్ రైటర్స్, స్టేషన్ టెక్నీషియన్లు తదితరులు పాల్గొన్నారు.

stya

ఇది కూడా చదవండి: Hyderabad Traffic Restrictions | వాహనదారులకు అలర్ట్​.. రేపు హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *