KTR Sensational Comments | నిన్ను కొట్టే రౌడీలు మా దగ్గర ఉన్నారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR Sensational Comments | బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మాజీ మంత్రి కేటీఆర్​ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మల్కాజ్‌గిరిలో ఒకడు నేను గూండాను, నేను రౌడీని అంటున్నాడు.. నిన్ను కొట్టే రౌడీలు, గూండాలు మా దగ్గర కూడా చాలా మంది ఉన్నారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

మల్కాజ్‌గిరి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్​ శుక్రవారం మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో బెదిరింపుల రాజకీయాలు పనికిరావని కేటీఆర్​ హెచ్చరించారు. బీఆర్​ఎస్​ కార్యకర్తలు భయపడొద్దన్నారు. కేసులు పెడితే తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎవరు ఏమీ చేయలేరన్నారు. అవసరం అయితే తాను మల్కాజ్​గిరిలో వచ్చి కూర్చుంటానని చెప్పారు.

KTR Sensational Comments | సభ్యత్వ నమోదుపై..

బీఆర్​ఎస్​ సభ్యత్వ నమోదు ప్రక్రియ కోసం యాప్ తయారు చేశామని కేటీఆర్​ తెలిపారు. సభ్యత్వ నమోదు మొత్తం డిజిటల్ పద్ధతిలోనే ఉంటుందన్నారు. యాప్ గురించి అవగాహన కల్పించారు. సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

KTR Sensational Comments | పేదల ఇళ్లు కూలుస్తున్న ప్రభుత్వం

కేసీఆర్ ప్రభుత్వం 2.5లక్షల మందికి పట్టాలు ఇచ్చిందని కేటీఆర్​ అన్నారు. కానీ రేవంత్ రెడ్డి రెండున్నరేళ్లలో హైడ్రా పేరు మీద ఎంతో మంది పేదల ఇండ్లు కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తెలిసో తెలియకో ప్రభుత్వ భూముల్లో ఇండ్లు కట్టుకున్న వారికి కేసీఆర్​ పట్టాలు ఇచ్చి ఆదుకున్నారని తెలిపారు. రేవంత్​రెడ్డి మాత్రం ఇళ్లు కూల్చి వేసి వారిని రోడ్డున పడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి..: Kinnerasani Jungle Safari | ‘కిన్నెరసాని’ అందాలు చూద్దామా.. జంగిల్ సఫారీ ప్రారంభం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *