అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kinnerasani Jungle Safari | పచ్చని ప్రకృతి అందాల నెలవు కిన్నెరసాని. ఎన్నో రకాల పక్షులు, వన్య ప్రాణులు ఇక్కడ ఉంటాయి. పచ్చదనంతో కళకళలాడే కిన్నెరసానిలో ప్రభుత్వం జంగిల్ సఫారీని ప్రారంభించింది. ప్రకృతి అందాలను తిలకించే అవకాశం కల్పించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కిన్నెరసాని అటవీ ప్రాంతం ఉంది. ఇందులో జంగిల్ సఫారీని గురువారం సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో పచ్చని అందాలను ఆస్వాదిస్తూ పక్షుల కిలకిలారావాలు వింటూ వన్యప్రాణాలను నేరుగా చూడొచ్చు. ఈ మేరకు మూడు సఫారీ వాహనాలు ఇప్పటికే అక్కడకు చేరుకున్నాయి. వీటి ద్వారా అడవిలో ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. దీంతో కిన్నెరసానికి పర్యాటక శోభ రానుంది.
Kinnerasani Jungle Safari | ట్రెక్కింగ్‌కు అవకాశం

జంగిల్ సఫారీతో పాటు నిపుణుల పర్యవేక్షణలో ట్రెక్కింగ్ చేసుకునే అవకాశాన్ని పర్యాటక శాఖ కల్పించింది. పచ్చదనంలో భద్రాద్రి జిల్లా రాష్ట్రంలోనే నెంబర్ వన్‌గా ఉందని, దీనిని మరింత అభివృద్ధి చేస్తామని అధికారులు తెలిపారు. కిన్నెరసాని డీర్ పార్కు నుంచి వాచ్ టవర్ వరకు, అక్కడ నుంచి మొండికట్ట బేస్ క్యాంప్ హరిణి వరకు సఫారీ కొనసాగుతుంది. వాచ్‌టవర్ వరకు ఒకరికి రూ.100, మొండికట్ట హరిణి వరకై తే రూ.200గా టికెట్ ధర నిర్ణయించారు. ఈ సఫారీలో చుక్కల జింకలు, అడవి దున్నలు, సాంబార్లు కనిపిస్తాయి.
ఇది కూడా చదవండి..: Singareni Workers Issues | సింగరేణికి ప్రభుత్వమే విద్రోహిగా తయారైంది : కవిత