Harish Rao Comments | మంత్రి జూపల్లి తీరుపై హరీశ్‌రావు సెటైర్లు..

మంత్రి జూపల్లి కృష్ణారావు తీరుపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Harish Rao Comments | మంత్రి జూపల్లి కృష్ణారావు తీరుపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ( Harish Rao )తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంగారెడ్డిలో జరిగిన బీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన, మంత్రిని ఉద్దేశించి “పూటకో సవాల్‌.. రోజుకో అడ్రస్‌” అంటూ ఎద్దేవా చేశారు.

Harish Rao Comments | కొత్త వాదనలు తెరపైకి..

మంత్రి జూపల్లి సవాళ్లపై స్పందించిన హరీశ్‌రావు.. “తెలంగాణ భవన్‌కు వస్తానని చెప్పి, ఆ తర్వాత గన్‌పార్క్‌కు మారుస్తారా? మమ్మల్ని పోలీసులు అడ్డుకుంటే, ఇప్పుడు కేసీఆర్ రావాలంటూ కొత్త వాదనలు తెరపైకి తెస్తున్నారు” అని విమర్శించారు. ప్రభుత్వం డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే క్రమంలోనే మంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
harish.1

 

Harish Rao Comments | అప్పుల లెక్కలపై క్లారిటీ..

కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై మంత్రి జూపల్లి వాట్సప్‌లో పంపిన లేఖపై కూడా హరీశ్‌రావు స్పందించారు. తాము అధికారంలోకి వచ్చాక రూ. 1.77 లక్షల కోట్ల అప్పు చేశామని జూపల్లే ఒప్పుకున్నారని, అయితే అసలు అప్పు రూ. 1.86 లక్షల కోట్లని హరీశ్‌రావు వివరించారు. ఆర్‌బీఐ గణాంకాలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వం అప్పుల విషయంలో తప్పుడు సమాచారం ఇస్తోందని ఆయన ఆరోపించారు.

ఇది కూడా చదవండి:  HYDRAA Demolition | మోతీనగర్​లో హైడ్రా కూల్చివేతలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *