HYDRAA Demolition | మోతీనగర్​లో హైడ్రా కూల్చివేతలు

హైదరాబాద్ నగరంలోని మోతీనగర్-బోరబండ రోడ్డు సిగ్నల్ వద్ద రహదారిని ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు శుక్రవారం తొలగించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: HYDRAA Demolition | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని మోతీనగర్-బోరబండ రోడ్డు సిగ్నల్ వద్ద రహదారిని ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు శుక్రవారం తొలగించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించి, రోడ్డు విస్తరణ చేపట్టడమే లక్ష్యంగా ముందుగా నోటీసులు ఇచ్చి మరీ ఫుట్‌పాత్‌ ఆక్రమణలను తొలగించినట్లు అధికారులు స్పష్టం చేశారు.

నగరంలో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ స్థలాలు, పార్కులు, చెరువులు, నాలాలను కబ్జా చెరల నుంచి విడిపిస్తోంది. అంతేగాకుండా రోడ్లు, ఫుట్​పాత్​లను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగిస్తోంది. నగరంలో ట్రాఫిక్​ కష్టాలకు చెక్​ పెట్టడానికి ఫుట్​పాత్​పై ఆక్రమణల తొలగింపును ఇటీవల ముమ్మరం చేసింది.

HYDRAA Demolition | భారీ బందోబస్తు మధ్య..

నగరంలో అనేక చోట్ల ఫుట్​పాత్​లు ఆక్రమణలకు గురయ్యాయి. పలువురు చిరు వ్యాపారులు ఫుట్​పాత్​లపై వ్యాపారాలు చేసుకుంటున్నారు. మరికొందరు దుకాణాదారులు సైతం వాటిని ఆక్రమించారు. ఈ క్రమంలో తాజాగా బోరబండ రోడ్డు సిగ్నల్ సమీపంలో రహదారి పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. పాదచారులకు ఇబ్బందిగా మారిన ఫుట్‌పాత్‌లు, రోడ్డు మార్జిన్‌లను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను భారీ జేసీబీలతో తొలగించారు. భారీ బందోబస్తు మధ్య వాటిని తొలగించారు.

HYDRAA Demolition | ఇంద్రేశంలో..

HYDRAA Demolition

సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో పార్కును హైడ్రా కాపాడింది. మహాదేవపురం సర్వే నంబర్లు 213, 214లోని 655 గజాల పార్కు స్థలాన్ని కొందరు కబ్జా చేయడానికి యత్నించారు. ఈ మేరకు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్​ వేసింది.

ఇది కూడా చదవండి..: Secunderabad Boy Kidnapping | సికింద్రాబాద్ బాలుడి కిడ్నాప్​ కేసు.. డాడీ అని పిలవడంతో ఎత్తుకెళ్లిన నిందితుడు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *