Grain Transport Obstruction | ధాన్యం రవాణాకు ఆటంకం.. 10 మందిపై కేసు నమోదు

Naresh Chandan
Grain Transport Obstruction

అక్షరటుడే, లింగంపేట: Grain Transport Obstruction | కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శెట్టిపల్లి సంగారెడ్డి గ్రామ శివారులో సోమవారం ధాన్యం రవాణాకు ఆటంకం కలిగించిన ఘటనలో 10 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై దీపక్ కుమార్ తెలిపారు.

Grain Transport Obstruction | కందకం తవ్వి…

పోలీసుల వివరాలు ప్రకారం.. మాలపాటి గ్రామానికి చెందిన రైతు కంపె రాజయ్య తన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు తీసుకురాగా.. తూకం పూర్తయిన తర్వాత లారీలు రాకుండా కొందరు రహదారికి అడ్డంగా జేసీబీతో కందకం తవ్వారు.

బాధిత రైతు ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. శెట్టిపల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన బాలరాజు, అరవింద్, చాకలి బాబు, సంపత్, రాజు, రాంబాబు, రవి, శివయ్య, హరికృష్ణ, రామచందర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

Mamata Banerjee setback | భవానీపూర్​లో మమత వెనుకంజ.. నందిగ్రామ్​లో సీఎం అభ్యర్థి సువేందు గెలుపు!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *