అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy GGH | ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ ప్రైవేట్ అంబులెన్స్ (Private Ambulance) బీభత్సం సృష్టించింది. ఆస్పత్రిలోకి వేగంగా వచ్చి జనరేటర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన కామారెడ్డి (kamareddy) జీజీహెచ్‌లో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
Kamareddy GGH | కామారెడ్డి పట్టణంలోని..
కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ అంబులెన్స్ జీజీహెచ్ బయట ఉంటుంది. కాగా, ఆదివారం అర్ధరాత్రి సమయంలో అంబులెన్స్ డ్రైవర్‌ను పక్కకు జరిపి ఓ ఆటో డ్రైవర్ అంబులెన్స్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని వాహనం స్టార్ట్ చేశాడు. ఒక్కసారిగా దూసుకెళ్లిన అంబులెన్స్ ఆస్పత్రిలో ఉన్న జనరేటర్‌ను బలంగా ఢీకొంది.
ఈ ఘటనలో జనరేటర్ డ్యామేజ్ అయింది. ప్రమాదం జరిగిన సమయంలో భారీ శబ్దం రావడంతో ఆస్పత్రిలో ఉన్న రోగులు భయాందోళనలకు గురయ్యారు. స్థానిక ప్రజలు, సిబ్బంది పరుగులు తీశారు. ప్రస్తుతం జనరేటర్ రిపేర్ చేయిస్తున్నారు. ఈ ఘటనపై ఆస్పత్రి వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం