అక్షరటుడే, వెబ్‌డెస్క్: Revanth Reddy | హైదరాబాద్ Hyderabad లో భారతీయ నిర్వహణ సంస్థ (IIM) ఏర్పాటు కోసం బీజేపీ ఎంపీలు చొరవ చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని పేర్కొంటూ పలు కీలక అంశాలపై కేంద్రం మద్దతు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Revanth Reddy | మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు
మెట్రో రైలు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలని సీఎం కోరారు. అలాగే ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చిందని, కేంద్రం నుంచి అవసరమైన నిధులు సమీకరించి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
SI Pujari Suspension | మైనర్ డ్రైవింగ్‌కు ప్రోత్సాహం.. ఎస్సై పూజారి తిరుపతిపై సస్పెన్షన్
మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద అనుమతులు, నిధులు మంజూరు అయ్యేలా కృషి చేయాలని కూడా ఆయన సూచించారు.
రాష్ట్రానికి కీలకమైన మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో కేంద్రం సహకారం అందితే అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
