జాతీయంPM Modi Visit | దేశాభివృద్ధిలో హైదరాబాద్​ పాత్ర కీలకం : ప్రధాని మోదీ

PM Modi Visit | దేశాభివృద్ధిలో హైదరాబాద్​ పాత్ర కీలకం : ప్రధాని మోదీ

దేశాభివృద్ధిలో హైదరాబాద్ పాత్ర కీలకమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణకు కేంద్రం నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi Visit | దేశాభివృద్ధిలో హైదరాబాద్ పాత్ర కీలకమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. నగరంలోని హైటెక్స్ (Hitex)​లో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మాట్లాడారు.

సైబరాబాద్‌ (Cyberabad) సామర్థ్యం అంతర్జాతీయమైందని మోదీ అన్నారు. ఈ ప్రారంభోత్సవాలతో ఉద్యోగ కల్పన జరుగుతుందన్నారు. ఉద్యోగ అవకాశాలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందన్నారు. వరంగల్‌ పీఎం మిత్ర పార్కు ద్వారా దేశంలో టెక్స్‌టైల్స్‌ రంగానికి ఊతమిస్తుందని తెలిపారు. దేశంలో రోడ్లు, రైల్వేలు, ఎయిర్‌పోర్టుల కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.

PM Modi Visit | 5 వందే భారత్​ రైళ్లు

తెలంగాణకు 5 వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat Express) రైళ్లు, 6 అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు ఇచ్చామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. పదేళ్లలో గుజరాత్‌కు ఎన్ని నిధులు ఇచ్చామో తెలంగాణకు అంతే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రధాని కాకతీయ టెక్స్‌టైల్స్‌ పార్క్‌ను ప్రారంభించారు. గుడెబల్లూర్-మహబూబ్‌నగర్‌ 4 లేన్ల రహదారి నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

దీనిని కూడా చదవండి : Vijay CM Speech | ‘మీ ఇంటి వ్యక్తినే నేను’.. ఈ విజ‌య్ మామ మీకు అన్ని విధాలా మంచి చేస్తాడంటూ కామెంట్‌

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Polytechnic Entrance Test | పాలిటెక్నిక్​ కామన్​ ఎంట్రెన్స్​ టెస్ట్​కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు: సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Polytechnic Entrance Test | పాలిటెక్నిక్​ కామన్​...

Telangana Promo Run | ఆరోగ్యకరమైన జీవనశైలికి ‘పరుగు’ ఎంతో ఉపయోగకరం..

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Telangana Promo Run | ఆరోగ్యకరమైన జీవనశైలికి...

Revanth Reddy | తెలంగాణపై పెద్ద మనసు చూపండి.. ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి విన్నపం!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Revanth Reddy | తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా...

Qatar Missile Attack| ఖతార్ తీరంలో క్షిపణి దాడి.. మంటల్లో బల్క్ క్యారియర్

అక్షరటుడే వెబ్‌డెస్క్:Qatar Missile Attack|పర్షియన్ గల్ఫ్‌లో ఉద్రిక్తతలు మరోసారి శిఖరాగ్రానికి చేరుకున్నాయి....