అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mamnoor Airport Tenders Floated | ఉమ్మడి ఓరుగల్లు వాసుల దశాబ్దాల కల అయిన మామునూరు విమానాశ్రయ నిర్మాణ ప్రక్రియలో మరో ముందడుగు పడింది. Warangal ఎయిర్పోర్ట్ అభివృద్ధి, ప్రధాన మౌలిక వసతుల కల్పన పనుల కోసం ‘ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (AAI) అధికారికంగా టెండర్లను ఆహ్వానించింది.
Mamnoor Airport Tenders Floated | రూ. 213.59 కోట్ల అంచనా వ్యయం
ఈ ప్రాజెక్టును జీఎస్టీ మినహాయించి రూ. 213.59 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నారు. ఇందులో కేవలం ప్రత్యక్ష నిర్మాణ వ్యయమే రూ. 178.07 కోట్లుగా ప్రాథమికంగా నిర్ణయించారు.
టెండర్ ద్వారా చేపట్టబోయే నిర్మాణాలను కూడా వివరించారు. ఆధునిక వసతులతో కూడిన కొత్త డొమెస్టిక్ టెర్మినల్ బిల్డింగ్. విమానాల రాకపోకల పర్యవేక్షణకు ప్రాణపదమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) టవర్, టెక్నికల్ బ్లాక్‌గా పేర్కొన్నారు. దీనికితోడు అత్యవసర సేవలకు ఫైర్ స్టేషన్, విద్యుత్ సరఫరా, నిర్వహణ కోసం ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్, వర్క్‌షాప్ ప్రాంగణాలు కూడా నిర్మించాల్సి ఉంటుంది.
Mamnoor Airport Tenders Floated | 18 నెలల్లో పూర్తి చేయాలని గడువు
ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను దక్కించుకునే సంస్థ ఒప్పందం కుదిరిన నాటి నుంచి 18 నెలల వ్యవధిలో నిర్మాణాలను పూర్తి చేయాలని ఏఏఐ స్పష్టమైన నిబంధన విధించింది.
- టెండర్ నోటిఫికేషన్ ప్రచురణ: 14.09.2026
- బిడ్ దాఖలు చివరి తేదీ: 03.11.2026
ఈ ప్రాజెక్ట్ పూర్తయి విమాన సేవలు అందుబాటులోకి వస్తే ఓరుగల్లు ప్రాంతంలో పారిశ్రామిక, పర్యాటక, ఐటీ రంగాలకు మహర్దశ పడుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.