అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana DCC Presidents Appointed | తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ప్రక్షాళన, బలోపేతంలో భాగంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలు జిల్లా కాంగ్రెస్ కమిటీలకు (DCC) నూతన అధ్యక్షులను నియమిస్తూ నిర్ణయం తీసుకోగా, ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఆమోదం తెలిపారు.
Telangana DCC Presidents Appointed | సంగఠన్ సృజన్ అభియాన్..
AICC ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ఈ నియామకాలకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ‘సంగఠన్ సృజన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.
ఇవే ఆ నియామకాలు..
- రామగుండం కార్పొరేషన్: MD. ముస్తఫా
- రంగా రెడ్డి జిల్లా: చిగిరింత పారిజాత
- సంగారెడ్డి జిల్లా: పటోళ్ల చంద్రశేఖర్ రెడ్డి
రాబోయే ఎన్నికలు, పార్టీ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని, క్షేత్రస్థాయిలో పార్టీకి మరింత ఊపు తెచ్చే దిశగా ఈ బాధ్యతలను అప్పగించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.