Phone Tapping Case|ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు..ఇవాళ ‘సిట్’ ముందుకు కాంగ్రెస్ నేత

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:Phone Tapping Case|రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక ముందడుగు పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(Revanth Reddy)  అత్యంత నమ్మకస్తుడైన కాంగ్రెస్ నాయకుడు, కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని దౌల్తాబాద్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీరాం రెడ్డికి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసుల నేపథ్యంలో ఇవాళ (సోమవారం) ఆయన బషీర్‌బాగ్‌లోని పాత పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు.

Phone Tapping Cas e| రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూనే ట్యాపింగ్?

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు తిరుపతి రెడ్డిల రాజకీయ వ్యూహాలు, ఆర్థిక లావాదేవీలు , వ్యక్తిగత విషయాలను పసిగట్టడమే లక్ష్యంగా అప్పటి ఇంటెలిజెన్స్ విభాగం పనిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డికి షాడోలా ఉండే శ్రీరాం రెడ్డి ఫోన్‌ను నాటి అధికారులు ట్యాప్ చేశారని సిట్ ప్రాథమికంగా గుర్తించింది. శ్రీరాం రెడ్డి ద్వారా సీఎం అంతర్గత సమాచారాన్ని సేకరించడమే టార్గెట్‌గా ఈ ట్యాపింగ్ జరిగినట్లు అనుమానిస్తున్నారు.

Phone Tapping Case | ఆ కోణంలోనే విచారణ

ఇవాల్టి విచారణలో శ్రీరాం రెడ్డి ఫోన్‌ను ఏయే కాలంలో ట్యాప్ చేశారు? ఎవరెవరితో మాట్లాడిన సంభాషణలను రికార్డ్ చేశారు? అనే సాంకేతిక అంశాలపై అధికారులు ఆయన్ను ప్రశ్నించనున్నారు. ఈ సందర్భంగా శ్రీరాం రెడ్డి వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడంతో పాటు, ఆయన మొబైల్‌కు సంబంధించిన కొన్ని కీలక సాంకేతిక ఆధారాలను కూడా సిట్ అధికారులు పరిశీలించనున్నట్లు సమాచారం. ఈ విచారణ తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొన్ని సంచలన నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Rahul Gandhi on Fuel Price | ఇంధన ధరల పెరుగుదలపై రాహుల్​ గాంధీ విమర్శలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *