Vijay CM Speech | ‘మీ ఇంటి వ్యక్తినే నేను’.. ఈ విజ‌య్ మామ మీకు అన్ని విధాలా మంచి చేస్తాడంటూ కామెంట్‌

Shashi kiran Mottala

అక్షరటడే, వెబ్​డెస్క్​: Vijay CM Speech | తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ టీవీకే అధినేత విజయ్ (Vijay) ముఖ్యమంత్రిగా (Tamil Nadu CM) బాధ్యతలు స్వీకరించారు. చెన్నైలో ఘనంగా జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఆయన చేసిన తొలి ప్రసంగం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Vijay CM Speech | నమ్మకం ఉంచి గెలిపించిన..

తనపై నమ్మకం ఉంచి గెలిపించిన తమిళ ప్రజలకు విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. “నన్ను ఇంతటి స్థాయికి తీసుకొచ్చింది ప్రజల ప్రేమ. మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను” అని భావోద్వేగంగా అన్నారు. ప్రత్యేకంగా యువతను ఉద్దేశించి మాట్లాడిన విజయ్.. “ఈ విజయ్ మామ మీకు అన్నివిధాలా మంచి చేస్తాడు. మీరే నా ప్రాణం” అంటూ అభిమానులను ఉత్సాహపరిచారు. రాజకీయాల్లో తన ఎదుగుదలకు యువతే ప్రధాన బలం అని పేర్కొన్నారు.

Vijay CM Speech | చెప్పిందే చేస్తాం..

తాను కేవలం ముఖ్యమంత్రి (Chief Minister) మాత్రమే కాదని, ప్రతి ఇంటి కుటుంబ సభ్యుడినని విజయ్ వ్యాఖ్యానించారు. “నేను మీ ఇంట్లో అన్నలా, తమ్ముడిలా ఉంటాను. నేను మీ అందరివాడిని” అంటూ ప్రజలకు దగ్గరవ్వాలని ప్రయత్నించారు.తమిళనాడులో నిజమైన లౌకికత, సామాజిక న్యాయంతో కూడిన పాలన అందిస్తామని విజయ్(Vijay Political Speech) హామీఇచ్చారు. “హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ముఖమే విజయ్ ముఖం” అంటూ మత సామరస్యంపై స్పష్టమైన సందేశం ఇచ్చారు. తన రాజకీయ ప్రయాణంలో టీవీకే కార్యకర్తల పాత్ర ఎంతో గొప్పదని విజయ్ గుర్తుచేసుకున్నారు. “పార్టీ కార్యకర్తలు లేకుంటే నేను ఈరోజు ఈ వేదికపై ఉండేవాడిని కాదు” అంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Vijay CM Speech | రాజకీయాల్లో పారదర్శకతకు ప్రాధాన్యం..

రాజకీయాల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తానని కూడా విజయ్ స్పష్టం చేశారు. “ఎవరికీ తెలియకుండా చీకటి రాజకీయాలు చేయను. ఏది ఉన్నా ప్రజల ముందే నేరుగా మాట్లాడుతాను” అని వ్యాఖ్యానించారు. తాను రాజకీయాల్లో కొత్తవాడినని, ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉందని విజయ్ అంగీకరించారు. “అన్నీ నేర్చుకోవడానికి నాకు కొంత సమయం ఇవ్వండి” అంటూ ప్రజలను కోరారు. తన ప్రభుత్వంలో ఒకటే పవర్ సెంటర్ Power Center ఉంటుందని, ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తామని విజయ్ వెల్లడించారు. మహిళల భద్రత తన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని కూడా ప్రకటించారు. గత ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు పూర్తి సమాచారం అందిస్తామని చెప్పారు.

“నాకు ఆకలి తెలుసు.. పేదరికం తెలుసు” అంటూ తన చిన్ననాటి అనుభవాలను విజయ్ Vijay గుర్తుచేసుకున్నారు. తాను ఎలాంటి ప్రత్యేక కుటుంబం నుంచి రాలేదని, సాధారణ కుటుంబంలో జన్మించి ప్రజల ప్రేమతో ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు. నేను దేవదూతను కాదు. మీలాగే సాధారణ మనిషిని అని చెప్పిన విజయ్.. ప్రజలకు సాధ్యమైన హామీలే ఇస్తానని స్పష్టం చేశారు. “ఆలోచిస్తాం.. అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ ఖాళీ మాటలు చెప్పం. ఏది సాధ్యమో అదే చేస్తాం” అని అన్నారు.

ఇది కూడా చదవండి: Chandrababu Delhi Tour| రేపు దిల్లీకి సీఎం చంద్రబాబు.. కేంద్ర మంత్రులతో కీలక భేటీ”

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *