Chandrababu Delhi Tour | రేపు దిల్లీకి సీఎం చంద్రబాబు.. కేంద్ర మంత్రులతో కీలక భేటీ

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Chandrababu Delhi Tour| ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం దిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి హస్తినకు చేరుకోనున్న ఆయన, రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులు మరియు పెండింగ్ నిధుల సాధన కోసం కేంద్ర మంత్రులతో వరుస సమావేశాల్లో పాల్గొంటారు.

Chandrababu Delhi Tour | కేంద్ర మంత్రులతో భేటీలు..

సీఎం పర్యటనలో భాగంగా ఉదయం 11:30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమై పోలవరం ప్రాజెక్టు నిధులు, ఇతర సాగునీటి ప్రాజెక్టుల అంశాలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమై రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సహకారంపై మంతనాలు జరపనున్నారు.

Chandrababu Delhi Tour | బిజినెస్ సమ్మిట్, నీతి ఆయోగ్ సభ్యులతో చర్చలు..

సాయంత్రం 4 గంటలకు హోటల్ తాజ్ ప్యాలెస్‌లో జరిగే ‘భారత పరిశ్రమల సమాఖ్య (CII) బిజినెస్ సమ్మిట్’లో చంద్రబాబు పాల్గొననున్నారు. అనంతరం ప్రధాని ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ ఎస్. మహేంద్రదేవ్‌తో పాటు నీతి ఆయోగ్ సభ్యులతో సమావేశమై రాష్ట్ర ప్రగతి ప్రణాళికలపై చర్చించనున్నారు.

ఇది కూడా చదవండి: Bhagirath Sai POCSO Case | భగీరథ్ సాయిని అరెస్ట్ చేయాల్సిందే.. పోలీస్​ స్టేషన్​ను​ ముట్టడించిన మహిళలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *