అక్షరటుడే వెబ్‌డెస్క్: Cabinet Infrastructure Projects | ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi )అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం దేశ మౌలిక వసతుల రంగానికి భారీ వరాలు ప్రకటించింది. రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, ఉత్తరప్రదేశ్‌లో కనెక్టివిటీని పెంచేందుకు ఉద్దేశించిన రెండు కీలక రహదారి ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మొత్తం ప్రాజెక్టుల విలువ రూ.14,115 కోట్లు అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
Cabinet Infrastructure Projects | ఢిల్లీ ట్రాఫిక్‌కు ద్వారకా టన్నెల్ విముక్తి..
ఢిల్లీలో రద్దీని తగ్గించేందుకు అత్యంత కీలకమైన ‘ద్వారకా టన్నెల్’ ప్రాజెక్టుకు కేంద్రం రూ.6,970 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఇది 8.1 కిలోమీటర్ల మేర సాగే 6-లేన్ల అండర్‌గ్రౌండ్ కారిడార్. శివమూర్తి ఇంటర్‌ఛేంజ్ నుంచి వసంత కుంజ్ మీదుగా DND ఫ్లైవే వరకు ఇది అనుసంధానం కానుంది. ఢిల్లీకి ఊపిరితిత్తుల వంటి ‘సదరన్ రిడ్జ్’ అడవులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా, అత్యాధునిక టన్నెల్ బోరింగ్ మెషీన్ (TBM) సాంకేతికతతో భూగర్భంలో ఈ సొరంగాన్ని నిర్మిస్తారు. దీనివల్ల గురుగ్రామ్, పశ్చిమ ఢిల్లీ నుంచి సౌత్, ఈస్ట్ ఢిల్లీకి ప్రయాణ సమయం భారీగా తగ్గడమే కాకుండా, రవాణా మరింత వేగవంతం కానుంది.

Cabinet Infrastructure Projects | బుందేల్‌ఖండ్‌కు కాన్పూర్ – కబ్రాయ్ రహదారి..
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని బలోపేతం చేసే లక్ష్యంతో రూ.7,145 కోట్లతో కాన్పూర్ – కబ్రాయ్ హైవే ప్రాజెక్టును కేంద్రం ఆమోదించింది. సుమారు 117 కిలోమీటర్ల ఈ 4/6 లేన్ల హైవే నిర్మాణం పూర్తయితే, ప్రస్తుతం పడుతున్న 3.5 గంటల ప్రయాణ సమయం కేవలం 1.5 గంటలకు తగ్గనుంది. పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు, ఆ ప్రాంతంలోని పారిశ్రామిక కేంద్రాలను అనుసంధానిస్తూ స్థానిక ఆర్థిక వృద్ధికి, వేలాది మందికి ఉపాధికి బాటలు వేయనుంది.
Cabinet Infrastructure Projects | మౌలిక వసతుల కల్పనలో దూకుడు..
కేవలం రోడ్లే కాకుండా, దేశవ్యాప్తంగా రవాణా , మౌలిక వసతుల ఆధునీకరణకు కేంద్రం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. దేశంలోని 57 కీలక రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.2.60 లక్షల కోట్లు కేటాయింపు, ప్రధాన నగరాల్లో 12 కొత్త మెట్రో ప్రాజెక్టుల కోసం రూ.1.50 లక్షల కోట్లు, ఓడరేవుల ఆధునీకరణ , షిప్ రిపేర్ సదుపాయాల కోసం రూ.1.50 లక్షల కోట్లు, 5 కొత్త విమానాశ్రయాల నిర్మాణం , ‘ఉడాన్’ పథకం విస్తరణకు రూ.37,000 కోట్లు కేటాయించారు. ఈ భారీ ప్రాజెక్టుల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: Shabbir Ali | కామారెడ్డి ప్రభుత్వ బాలుర పాఠశాలను రాష్ట్రంలోనే మోడల్‌గా తీర్చిదిద్దుతాం