అక్షరటుడే, ఆర్మూర్: Ponnam Prabhakar | రాష్ట్రంలో బీజేపీ కనుమరుగైందని, బీఆర్ఎస్తో(BRS) పొత్తు పెట్టుకుని అక్కడక్కడా బీజేపీ సీట్లు సాధించిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఖాందేశ్ శ్రీనివాస్ కూతురు వివాహం ఇటీవల జరుగగా.. బుధవారం మంత్రి వారి ఇంటికి వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు.
Ponnam Prabhakar | పలు రాష్ట్రాల్లో ఓట్లు తారుమారు..
అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక ఒటరు సవరణ ప్రక్రియ ‘సర్’ పట్ల ఓటర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేకుల ఓట్లు తొలగించి ఫలితాలను తారుమారు చేశారన్నారు. తెలంగాణలో(Telanagana) సైతం అదేవిధంగా ప్రయత్నం జరిగే అవకాశం ఉందన్నారు. భారత ఎన్నికల కమిషన్ బీజేపీ అనుబంధ సంస్థగా మారిందని ఆయన ఆరోపించారు. 20 ఏళ్లకు ఒకసారి ఈ ప్రక్రియ జరుగుతుందని గతంలో 2002లో ప్రజాస్వామ్య బద్దంగా అర్హులైన ఓటర్లలో మిస్ కాకుండా నిర్వహించారని, ప్రస్తుతం అనేక ఆరోపణలు వ్యక్తమవుతున్నాయన్నారు. ప్రతి ఓటర్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణకు వచ్చిన బీజేపీ అధ్యక్షుడు తాను వచ్చినట్లు రాష్ట్ర ప్రజలు మాట్లాడుకోవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ను విమర్శించారన్నారు. 12 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలన్నారు. విభజన హామీలు సైతం నెరవేర్చే పరిస్థితుల్లో లేదన్నారు.

ఇది కూడా చదవండి : ‘కేబినెట్ సమావేశంలో రెండు కుర్చీలు వేసుకుని కూర్చునే నువ్వు కూడా జగదీష్ రెడ్డి ఎత్తు గురించి మాట్లాడతావా రేవంత్ రెడ్డి’ –బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్